RX 100 మూవీతో కుర్రకారుకి హీట్ పెంచేసింది పాయల్ రాజ్‌పుత్. ఆన్ స్కీన్ లోనే కాక, ఆఫ్ స్క్రీన్ లో కూడా తన పోటో షూట్ లతో చేసే హంగామా అంతా ఇంతా కాదు. రీసెంట్‌గా అలాంటి ఫొటో షూట్ చేసస్తున్న సమయంలోనే పాయల్ కి ఓ చేదు అనుభవం ఎదురైంది.
ఈ షోలో ఆమె బ్రా లేకుండా కేవలం కోటు మాత్రం వేసుకుని ఫొటోలకి ఫోజిచ్చింది. ఫోటో షూట్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా కోటు పక్కకి జరిగి ఆమె ఎద అందాలు కాస్త కనపడ్డాయి. ఈ వీడియో కాస్తా లీక్ అవ్వటంతో, ఇంకేముంది కుర్రాళ్ళు రెచ్చిపోయారు. ఆ వీడియోను తెగ ట్రోల్ చేశారు. కానీ, పాయల్ మాత్రం ఈ వీడియో గురించి ఏ విధంగాను స్పందించలేదు.
ఈ రోజు అంటే… డిసెంబర్ 5 పాయల్ పుట్టినరోజు కావటంతో, ఈ వీడియో గురించి స్పందించింది. పొరపాటుగా లీకైన ఈ వీడియోపై సోషల్ మీడియా చేసిన ట్రోలింగ్ చూసి, కొన్ని రోజుల పాటు నేను నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా చాలా భయపడ్డాను. చాలా మంది నా గురించి చీప్ కామెంట్స్ చేశారు. ఆ విషయమై నేను చాలా కలత చెందాను. అసలే నేను చాలా ఎమోషనల్ గా ఉంటాను. ఈ విషయం తెలిసి నా ఫ్యామిలీ కూడా చాలా బాధపడింది. ఒకానొక దశలో మా అమ్మ అయితే నాకు ఫోన్ చేసి… ఇక్కడితో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి… వచ్చేయమని చెప్పింది. కానీ, నేను మాత్రం ఇలాంటి వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పాను.
ఇక ఈ వీడియోలో జరిగిన పనిలో నా ప్రమేయం లేదు. కానీ, నేనేదో చేయరాని తప్పు చేసినట్లు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఆడవాళ్ళని ఇలా ఎప్పుడూ చూడనట్లు ఎందుకు మాట్లాడుతున్నారు. అందరి ఆడవాళ్ళలో లేనిది… నా దగ్గర ఏముంది? అని ఆశ్యర్యపోయానంటూ జవాబిచ్చింది పాయల్ రాజ్‌పుత్.