ఫ్లైట్ జర్నీ ఎంత బాగుంటుందో… అది క్రాష్ అయితే అంత బాధగానూ ఉంటుంది. అప్పుడప్పుడూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్లెయిన్స్ క్రాష్ అవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఒక్కోసారి ప్యాసింజర్స్ సేఫ్ గా బయట పడితే, ఒక్కోసారి మాత్రం ఇన్జ్యూర్ అవుతూ ఉంటారు. ఇక ఈ సారి మాత్రం అందరూ చూస్తుండగానే చూట్టూ ఒక్కసారిగా మంటలు రావటం, గాల్లోనే విమానం పేలిపోవటం సంభవించాయి. ఈ దృశ్యం చూస్తానికి చాలా భయంకరంగా ఉంది.
ఎక్కడో..! ఏమిటో..! తెలియదు కానీ, భూమికి కొంచెం ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం సడెన్ గా అడ్డదిడ్డాలుగా తిరగటం మొదలుపెట్టింది. ఇక విమానం పేలిపోవటానికి ఒక్క సెకను ముందు పైలెట్ ప్యారాచూట్ సాయంతో కిందకి దూకేస్తాడు. అతని అదృష్టం అతను మాత్రం చాలా సేఫ్ గా బయటపడ్డాడు.
వెంటనే ఆ విమానంనుండీ పేలుడు స్టార్ట్ అయి… కొద్ది సెకన్ల వ్యవధిలోనే నేలమీద పడిపోతుంది. భూమిని బలంగా ఢీకొనడంతో పెద్ద పేలుడు సంభవిస్తుంది. దీంతో విమానం పూర్తిగా తునాతునకలైంది. ఈ దుర్ఘటన చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. దానినుండీ వచ్చే మంటలు ఆకాశానికి ఎగసిపడుతున్నాయి. విమానం పూర్తిగా తునాతునకలైంది. చూడటానికి అదో బాంబ్ బ్లాస్ట్ ని తలపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Ejecting with no time to spare pic.twitter.com/ayoXIZwAZ0
— That Looked Expensive (@LookedExpensive) June 23, 2022