ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోన్న ముఖ్యమైన సమస్యల్లో గ్లోబర్ వార్మింగ్ ఒకటి. రోజురోజుకీ పెరిగిపోతున్న భూతాపం వల్ల ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. మంచు కొండలు కరగడంతో సముద్రాల్లో నీటి మట్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో అనుకోని ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. ఇదంతా మనం మన చేతులారా చేసుకుంటున్నదే అనే విషయం అందరికి తెలిసిందే. ప్లాస్టిక్, ఇంధన వినియోగం బాగా పెరగడంతో వాయు కాలుష్యం వంటి సమస్యలు భూమికి శాపంగా మారుతున్నాయి.
దీంతో పర్యవరణ పరిపరక్షణ కోసం పెద్ద పెద్ద ప్రచారాలు కూడా చేస్తున్నారు. మరి కొందరు పర్యావరణ ప్రేమికులు భూమిని ఎలా కాపాడుకోవాలో ఉపన్యాసాలు చెబుతున్నారు. అయితే ఈ ఉపన్యాసాలు విని మారే వారు ఎంత మంది ఉంటారు అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి మనది. అయితే లక్ష మాటల్లో కూడా చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటో మనకు చెబుతుంది.
ఈ వీడియోలు కూడా సందేశాన్ని పంచుతాయనడానికి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోనే సాక్ష్యంగా చెప్పొచ్చు. పర్యావరణ పరిరక్షణ కోసం వెంటనే రంగంలోకి మనం దిగకపోతే ఏం జరుగుతుందన్న విషయాన్ని ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
అసలు వివరాల్లోకి వెళితే జపాన్‌లో ఓ సెంటర్‌లో ఒక తల్లి తన చిన్నారిని చేయి పట్టుకొని నిలబడున్నట్లు విగ్రహాన్ని తయారు చేశారు. అయితే అందులో మనకీ కనిపించే తల్లి మాత్రమే విగ్రహం, పక్కనే ఉన్న చిన్నారిని ఐస్‌తో తయారు చేశారు. వేడి కారణంగా ఆ చిన్నారి విగ్రహం క్రమంగా క్రమంగా కరిగిపోయింది. కరుగుతూ, కరుగుతూ చివరికి ఆ విగ్రహం పూర్తిగా మాయపై పోయింది.
అక్కడ తిరుగుతోన్న జనాలు ఆ విగ్రహాలను చూసి కింద ఉన్న కొటేషన్‌ను చదువుతూ వెళుతున్నారు. ఇంతకీ అక్కడ రాసున్న ఆ కొటేషన్ ఏంటంటే. ‘గ్లోబల్ వార్మింగ్ కారణంగా మనకీ భవిష్యత్తు అంతం కానుంది’ అని. ఒక్క చిన్న లైన్ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏంటో చెప్పకనే మనకి చెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
What a powerful depiction !💐💐💐💐 #GlobalWarming 😢😢@hvgoenka @ipsvijrk @ParveenKaswan @arunbothra @moefcc pic.twitter.com/DP6PS6Fll0
— Rupin Sharma (@rupin1992) May 4, 2022