పునీత్ రాజ్ కుమార్ మరణించి నేటికి 11 రోజులు అయింది. 11వ రోజు సంస్మరణ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు తెల్లవారుఝామున ఐదుగంటల నుంచే అభిమానులు కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టారు.
నిన్న ఆదివారం సెలవుదినం కావటంతో… అర్ధాంతరంగా ముగిసిపోయిన తమ అభిమాన నటుడి సమాధిని చూడటానికి జనసంధ్రంలా తరలివచ్చారు. దీంతో అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పునీత్ రాజకుమార్ కూతురు ధృతి అన్న మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
Also Read: 4 రోజుల తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని చూసిన పునీత్ (వీడియో)
తండ్రి మరణవార్త విన్న ఆయన కూతురు ధృతి… అమెరికా నుంచి డైరెక్ట్‌గా వచ్చి… బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి స్పెషల్ కాన్వాయ్‌లో ఇంటికి చేరుకొని… వెంటనే కంఠీరవ స్టేడియానికి వచ్చింది. వచ్చీ రాగానే ఒక్కసారిగా తన తండ్రి పార్ధీవదేహంపై పడి భోరున ఏడ్చేసింది.
అమెరికా వెళ్లేముందు తనతో ఎంతో సరదాగా గడిపిన నాన్న… ఇప్పుడు విగత జీవిగా పడి ఉండటం చూసి కన్నీటి పర్వంతమయింది. తన తల్లిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అక్కడ ఉన్నవారికి ఆ తల్లి కూతుళ్లని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇక పునీత్ కూతుళ్లిద్దరూ డాడీ! మమ్మల్ని వదిలి వెళ్లావా..! నీవిక మాకు కనిపించవా..! నీ గుండే నిన్ను మోసం చేసిందా..! అంటూ బోరున విలపించారు.
Also Read: పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలివే..! ఈ సీసీ ఫుటేజ్ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు.!!
అనంతరం కుంటుంబ సభ్యుల నిర్ణయం ప్రకారం ప్రభుత్వ లాంఛనాల మధ్య కంఠీరవ స్టూడియోలో పునీత్ అంత్యక్రియలు జరిగాయి.