ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏం జరిగినా వెంటనే ప్రపంచానికి తెలిసిపోతుంది. జరిగిన సంఘటనని ఎవరో ఒకరు క్యాప్చర్ చేయటం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం కామన్ అయిపొయింది. ఇలాంటి సంఘటనే రీసెంట్ గా ఒకటి జరిగింది.
పంజాబ్ లోని డేరా బస్సీలో హబెత్‌పూర్ రోడ్డుపై ఓ జంట వెళుతుండగా… సడెన్ గా ఏమైందో! ఏమో! తెలియదు కానీ, పోలీసులతో వాగ్వాదం జరుగుతుంది. ఆ సమయంలో యువతి పై ఓ పోలీస్ మ్యాన్ హ్యాండిల్ చేస్తాడు.ఆమె మరో ఇద్దరితో కలిసి మొత్తం ముగ్గురూ పోలీసుపై దాడి చేయడం మొదలు పెట్టారు. ఇంతలో ఆమె భర్త ప్రతిఘటించడంతో, అతని తొడపై షూట్ చేస్తాడు ఆ పోలీస్.
అతడి తొడ భాగంలో బుల్లెట్ దిగటంతో… నొప్పితో అతడు విలవిలలాడిపోయాడు. అనంతరం మిగిలిన వారంతా ఆ పోలీసు పై మూకుమ్మడి దాడి చేశారు. ఇదింతా అక్కడున్న ఓ వ్యతి రికార్డు చేసినట్లు సమాచారం.
ఇక మేమంతా రోడ్డుపై నిలబడి ఉండగా… ఒక పోలీసు వచ్చి మాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వారు నా భార్య బ్యాగ్‌ని తనిఖీ చేయాలనుకున్నారు. అంతేకాదు, వారు బాగా మద్యం సేవించి, నా సోదరుడిపై కాల్పులు కూడా జరిపారు అని బాధితురాలి సోదరుడు అక్షయ్ చెప్పుకొంటూ వచ్చాడు.
डेराबस्सी में पंजाब पुलिस ने एक महिला के साथ हाथापाई की और जब उसके पति ने उसका विरोध किया तो उसको गोली मार दी। @ArvindKejriwal के सत्ता में आने के बाद पंजाब पुलिस ने पंजाब नागरिकों को इंसान समझना बंद कर दिया है।इतने पुलिस वाले चाहते तो एक आदमी को पकड़ सकते थे लेकिन गोली मार दी गई pic.twitter.com/8phXweYhel
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) June 27, 2022