ప్రపంచంలో ఎప్పటికప్పుడు జరిగే ప్రతి తాజా సమాచారాన్నివెంటనే మనకు అందించటంలో సోషల్ మీడియా ముఖ్య పాత్రను పోషిస్తూ అగ్రగామిగా నిలుస్తూ ఉంది. అయితే ఇందులో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరి కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. తాజాగా వైరల్ అయిన ఒక వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి.
ఓ వ్యాపారస్తుడు తనకు దొరికిన కొద్ది పాటి విశ్రాంతి సమయంలో పడుకొని తన ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ సమయములోనే అతనికి ఒక పెద్ద సమస్య వచ్చిపడి తన ఎంజాయ్ మెంట్ కు బ్రేక్ పడేలా చేస్తుంది. అదేంటో ఇప్పుడే చూసేద్దాం.
ఒక షాప్ యజమాని తన సెల్ లో వీడియో కాల్‌లో మాట్లాడుతూ, చాలా సరదాగా నవ్వుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇంకేముంది సరిగ్గా ఆ టైం లోనే అక్కడకు వచ్చి చేరింది ఒక చిట్టి, పొట్టి ఎలుక. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతి వేగంతో దూసుకొని పోయి నేరుగా అతని ప్యాంటులోకి దూరేస్తుంది. అంతే వెంటనే దానిని గ్రహించిన ఆ వ్యక్తి లేచి ప్యాంటును దులుపుకోవటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ఎలుక మాత్రం ఎంతకీ బయటకు రాలేదు.
వెంటనే అతను మరొక ప్రయత్నం చేస్తూ తన ప్యాంటు నాడాను వెంటనే విప్పేస్తాడు. అప్పటి వరకు అతని ప్యాంటులోదూరి విశ్రాంతి తీసుకున్న ఆ చిట్టి, పొట్టి ఎలుక కిందకు దూకి పారిపోతుంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని వెంటనే అతను తన ప్యాంటును మళ్లీ వేసేసుకుంటాడు.
వీడియో కాల్ మాట్లాడుతూ.. సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండే సమయంలో ఎలుక చేసిన పనికి అతను నివ్వెర పోయి నిరుత్సాహపడతాడు. ఈ ఘటనా సమయంలో అతని హావభావాలను, విన్యాసాలను మరియు అతను చేసే బ్రేక్ డాన్సును చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేక కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
అయ్యో ఆనందంలో విచారం అంటూ కొందరు, ఎంత కష్టం వచ్చిపడిందో అంటూ ఇంకొందరు, సరిగ్గా విశ్రాంతి తీసుకుంటున్నసమయంలోనే మళ్లీ పెద్ద పనే వచ్చి పడింది కదా! అని మరి కొందరు ఇలా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హలచల్ చేస్తుంది.
— UncleRandom (@Random_Uncle_UK) November 5, 2021