రామాయణ మహాకావ్యంలో రాముడికి ఎంత విశిష్టత ఉందో… రావణుడికీ అంతే విశిష్టత ఉంది. ముఖ్యంగా, రావణుడు ఉపయోగించిన వాహనాల గురించి ఇప్పటికీ రీసర్చ్ జరుగుతూనే ఉంది. లంకేశుడు ఆ కాలంలోనే విమానాలని ఉపయోగించినట్లు ఆధారాలు చెప్తున్నాయి.
రావణ ది ఫస్ట్ ఏవియేటర్ అని శ్రీలంక ప్రజలు నమ్ముతారు. ఆ విమానంలో రావణుడు… శ్రీలంక నుంచి భారత్‌కి ప్రయాణించినట్లు చరిత్ర చెప్తుంది. నేటి తరం విమానం వలే లేకున్నా… పుష్పక విమానం అనే పేరుతో ఉండేది. అంతేకాదు, ఈ విమానం ల్యాండ్ అవ్వటానికి ఏరోడ్రమ్స్ కూడా ఉన్నట్లు స్పష్టమవుతుంది. అయితే, ఇది కేవలం కల్పితమని కొట్టిపారేసే వాళ్లూ లేకపోలేదు.
అయితే, రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? లేదా? అనే విషయం గురించి తెలుసుకోవటానికి… శ్రీలంక గవర్నమెంట్ గతంలోనే ఓ రీసర్చ్ టీమ్ ని ఏర్పాటు చేసింది. గతేడాది కరోనా కారణంగా నిలిచి పోయిన ఈ రీసర్చ్ పనులు మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే, ఈసారి ఈ పరిశోధనల్లో ఇండియన్ గవర్నమెంట్ కూడా పాల్గొనాలని శ్రీలంక పరిశోధన బృందం కోరింది. ఈ అంశంపై పరిశోధనలు చేయటానికి శ్రీలంక ప్రభుత్వం 5 మిలియన్ శ్రీలంకన్ రూపీస్ ఫండ్స్ ని రిలీజ్ చేసింది.