కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కేవలం ఫిల్మ్ అప్డేట్స్ గురించి మాత్రమే కాకుండా… ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా తన స్టైల్లో రియాక్ట్ అవుతూ ఉంటారు ఆర్జీవి.
తన మనసులోని మాటలని నిర్మొహమాటంగా బయపెడుతూ… తనకి నచ్చినట్టుగా బతికేస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్లపై ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తుంటారు. ఈమధ్య ఇంటర్వ్యూలలో, టీవీ షోలలో అక్కడున్న అమ్మాయిలని తెగ పొగిడేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా యాంకర్ శ్యామలపై కూడా ఓపెన్ కామెంట్స్ చేశారు ఆర్జీవి.
తాజాగా ‘బడవ రాస్కెల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు ఆర్జీవి. ఈ ఈవెంట్ కి యాంకర్ శ్యామల హోస్టింగ్ చేస్తుంది. శ్యామల ఆర్జీవీని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయగానే… వేదిక ఎక్కిన ఆర్జీవి ముందుగా శ్యామలని తనస్టైల్లో పొగడ్తలతో ముంచెత్తాడు.
ఒక్కసారిగా ఆర్జీవి తనని ఉద్దేశించి అలా మాట్లాడేసరికి షాక్ కి గురయింది శ్యామల. ఇవేకాక, తనని అందరూ తోపు, రౌడీ, గుండా అని అనేక రకాల పేర్లతో పిలిచేవారని కానీ, తానో పెద్ద రాస్కెల్ ని అని చెప్పుకుంటూ వచ్చారు ఆర్జీవి.