అస్సాం అడవి నుండి ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్… ఆ తరువాత తేజ్‌పూర్ పట్టణ శివార్లలో ఉన్న వ్యక్తులపై దాడి చేసింది, వారిలో కనీసం ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇది ఇంకా బయటే సంచరిస్తూ ఉండటంతో, ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.
కజిరంగా నేషనల్ పార్క్ లేదా నమేరి నేషనల్ పార్క్ మరియు ఫారెస్ట్ రిజర్వ్ నుండి ఈ పులి బయటికి వచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. సాదారణంగా నమేరిలోని పులులు వాటర్ కోసం జియా భరాలి నది ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. మరి ఈ టైగర్ ఏ కారణం చేత బయటికి వచ్చిందో తెలియదు.
కానీ, తప్పించుకొని పారిపోయిన ఈ బెంగాల్ టైగర్ సమీపంలో ఉన్న ఇద్దరు వ్యక్తులపై దాడికి దిగింది. అందులో ఓ వ్యక్తి తప్పించుకోగా… మరో వ్యక్తిని వెంబడించింది. ఆ వ్యక్తి భయంతో పరిగెడుతూ, అకస్మాత్తుగా ఓ గుంటలో జారిపడతాడు. పులి కూడా అతనితోపాటే గుంటలోకి దూకింది. కానీ, ఏమైందో… ఏమో… తెలియదు పులి మాత్రం పైకి వచ్చేస్తుంది. ఆ వ్యక్తి బతికి బయట పడ్డాడు.
ఇదంతా వినటానికి, చూడటానికి చాలా విచిత్రంగా ఉన్నా… ఇది మాత్రం నిజం. దగ్గరలో ఉన ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.