టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం RRR. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్‌లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ప్రమోషన్ పార్ట్ ని ఈ పాటికే మొదలు పెట్టేసింది చిత్ర యూనిట్.
అయితే, మూవీ ట్రైలర్ లో భాగంగా నిన్న భీమ్, మరియు రామ్ ఇద్దరి పోస్టర్స్ ని రిలీజ్ చేసిన మూవీ టీమ్ ఈ రోజు రామ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. 14 సెకన్ల నిడివి కల ఈ వీడియో ‘Brace Yourself for Ram’ అని చెబుతుంది. ఇక భీమ్ గ్లిమ్ప్స్ ని రేపు రిలీజ్ చేయనున్నారు.
ఇక మూవీ విషయానికొస్తే… ఇది చరణ్, తారక్ ఇద్దరికీ కూడా తొలి పాన్ ఇండియా మూవీ. బాహుబలి తర్వాత రాజమౌళి చేపట్టిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.