‘రాజా వారు రాణి గారు’ ఫేం కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సమ్మతమే’! టాలీవుడ్ లో యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు కిరణ్ అబ్బవరం. ఇక ఈ సినిమాతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లనుంది. ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకి మంచి రొమాంటిక్ ఫీల్ అని అందిస్తుంది. ఇక ఈ సినిమాతో గోపీనాధ్ రెడ్డి అనే కుర్రాడు కొత్త డైరెక్టర్ గా పరిచయం అవ్వబోతున్నాడు.
ప్రేమంటే తెలియని ఓ కుర్రాడు అమ్మాయి ప్రేమలో ఎలా పడ్డాడు? ఆ తర్వాత వారిద్దరి మద్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు, ఇంకా లవ్వంటే ఏంటో తెలియని హీరోకి తన ఫ్రెండ్స్ ఎలా గైడ్ చేశారు? ఇలాంటి సన్నివేశాలతో సాగే ఈ టీజర్ ఆద్యంతం మంచి ఫన్ ని అందించింది.
హీరో హీరోయిన్ లిద్దరూ క్రిష్ణ, సాన్వి అనే లవర్స్ రోల్ ప్లే చేస్తున్నారు. ఒకసారి “ఐలవ్ యు క్రిష్ణ” అని సాన్వి ప్రపోజ్ చేస్తుంది. అందుకు కృష్ణ ఈ పెళ్లికి ముందు ప్రేమ అనేది నాకు పడదండి! అందులో నేను పడను. అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు. కానీ, స్నేహం పేరుతో జర్నీ స్టార్ట్ చేసి తనకి తెలియకుండానే ప్రేమలో పడిపోతాడు కృష్ణ.
అయినప్పటికీ తానేమీ ప్రేమలో పడలేదని వాదించే కృష్ణని ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ మోటివేట్ చేయటం బాగుంది. “ ఆ అమ్మాయిని చూడగానే ఫ్యూజ్ కొట్టేసిన ఫీల్ కల్గితే దాన్ని లవ్ అంటారు” అని స్నేహితుడు చెప్పడం అది విన్నాక తాను నిజంగానే ప్రేమలో పడిపోయానేమోనని కృష్ణ ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోవటం భలే గమ్మత్తుగా ఉంది.
ఇక హీరో హీరోయిన్ల మద్య జరిగే సంభాషణల విషయానికొస్తే, మీరు తాగుబోతులా ఉన్నారే అని హీరోయిన్ సాన్వి అంటే… మీరు గజ తాగుబోతులా ఉన్నారంటూ హీరో కౌంటర్ ఇస్తాడు. అలానే, “నీది ఏ రెలీజియన్ డీసీ నా… మార్వెల్ నా…“ అని సాన్వి అంటే… అవేమీ మనకి తెలియదు, మనకేదైనా బాలయ్య బాబే! అంటూ నటసింహ బాలకృష్ణపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటాడు కృష్ణ.
మొత్తం మీద ఇదో పర్ఫెక్ట్ యూత్ లవ్ స్టోరీగా నిలిచి పోవటం ఖాయం. కేవలం ఈ టీజరే యూత్ ని అంతలా ఆకట్టుకుందంటే… ఇక మూవీ మొత్తం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలంటే… రిలీజ్ డేట్ వరకూ వెయిట్ చేయాల్సిందే!