ప్రకృతిలో జరిగే ఎన్నో వింతలు మానవ మేథస్సుకు ఎప్పుడూ సవాల్ విసురుతూనే ఉన్నాయి. భూమిపైన, అంతరిక్షంలో, సముద్ర గర్భంలో… ఇలా అక్కడా ఇక్కడా అని కాకుండా ప్రతిచోట ఆశ్చర్యం కలిగించే ఎన్నో వింతలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇక చాలాకాలంగా సైంటిస్టులు మహా సముద్రాల లోతుల్లో దాగి ఉన్న రహస్యాల గురించి కూడా అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో డీప్ వాటర్ లో 14 రకాల లార్వాలను గుర్తించారు. ఇవి డీప్ సీ లో 3,000 అడుగుల లోతులో నివసించే పలు రకాల జాతులకి చెందిన లార్వాలు.
ఈ లార్వాలన్నీ రొయ్యలు, ఎండ్రకాయల జాతికి చెందిన ఈ జీవులు. అయితే, ఇవి ఏలియన్స్ రూపాన్ని కలిగిఉండటం విశేషం. వీటిలో కొన్నిటికి తలలపై కొమ్ములు ఉన్నాయి. అలాగే, ఆరెంజ్, బ్లూ కలర్లలో… డిఫెరెంట్ షేడ్లలో… కూడా ఉన్నాయి. అంతేకాదు, ఇవి మునుపటి మెరైన్ ఆర్గానిజమ్స్ వెర్షన్స్ తో పోల్చుకుంటే విచిత్రమైన లక్షణాలను కలిగి ఉన్నట్లు గమనించారు.
అయితే, డీప్ సీ లోని మెసోపెలాజిక్ జోన్‌లో అనేక రకరకాల జీవులు నివసిస్తున్నట్లు తేలినప్పటికీ, ఈ 14 రకాల జీవులని ఎప్పుడూ చూడలేదని స్కూబా డ్రైవర్స్ చెప్తున్నారు. మరి ఇవి ఏ విధంగా పెరుగుతాయి? వాటి లైఫ్ సైకిల్ ఏంటి? అనే విషయాలను గురించి తెలుసుకోవడానికి వీళ్ళు మరింత డీప్ గా స్టడీ చేయనున్నారు.