ఈ ఏడాది వచ్చిన మొట్ట మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30వ తేదీన ఏర్పడనుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. అయితే, గ్రహణం ఏర్పడే రోజు అమావస్య, మరియు శనివారం కావటంతో దీనిని ‘శనిశ్చరి అమావస్య’ అని అంటారు. అందుకే, ఈరోజు దానాలు చేయడం, నదీ స్నానం చేయడం వంటివి చేస్తే చాలా మంచిది.
నిజానికి ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. అంటార్కిటికా, అట్లాంటిక్, సౌత్ అమెరికాలోని నైరుతి భాగం, పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం, ఈ గ్రహణం ఏప్రిల్ 30 మధ్యాహ్నం 12.15 గంటలకు మొదలయి, మరుసటి రోజు అంటే మే 1 ఉదయం 04:07 గంటలకు ముగుస్తుంది.
అయితే, ఈ సోలార్ ఎక్లిప్స్ ప్రభావం కొన్ని రాశులపైన ఎక్కువగా పడనుంది. మరి ఆ రాశులేవో… వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో… తెలుసుకుందాం.
Also Read: ఈ 4 రాశులవారికి వచ్చే రెండు నెలల్లో అదృష్టం వరిస్తుంది!
మేషరాశి:
అసలు ఈ గ్రహణం ఏర్పడేదే మేషరాశిలో. కాబట్టి దీని ప్రభావం మేషరాశి వారిపై చాల ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు విపరీతమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయంలో శత్రువులు ఎవరినా ఉంటే… వీరిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. లేదంటే నష్టపోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో వీరు ఏ పనిలోనూ తొందరపడకూడదు.
కర్కాటక రాశి:
ఈ రాశికి అధిపతి చంద్రుడు కావతంచేత ఈ సమయంలో, చంద్రుడు రాహువుతో కలిసి మేషరాశిలో ఉంటాడు. ఈ కారణంగా వీరికి మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. భయం, నెగెటివిటీ వంటివి ఉంటాయి. ఇంకా ఖర్చులు పెరుగుతాయి. అందుకే ఎంతో సహనంతో ఉండటం ఉత్తమం.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు తమ గౌరవాన్ని కోల్పోతారు. కనుక ఈ సమయంలో, ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. శత్రువులు మీకు హాని కలిగించే అవకాశం ఉంది. ఇతరులతో వాదనలకి దిగకండి.