ఇటీవలి కాలంలో చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కల్గిస్తుంటే… ఇంకొన్ని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. కొన్ని సరదాగా అన్పిస్తుంటే… మరికొన్ని విచారాన్ని కల్గించేలా ఉంటున్నాయి.
ఏదేమైనా మొత్తం మీద సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరిగే వింతలన్నిటినీ ఇంట్లో కూర్చునే చూసేయ గలుగుతున్నాం. రీసెంట్ గా అలాంటి వీడియోనే ఒకటి లీకయ్యింది.
మార్చి 1న దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. పండుగ సందర్భంగా శివాలయాలన్నీ భక్తుల రద్దీతో కళకళలాడాయి. ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి.
ఇదంతా మనకి ఓకే కానీ, ఒక నాగుపాముకి ఆ రోజు శివరాత్రి అని ఎలా తెలిసిందో! ఇప్పటికీ అర్ధం కావట్లేదు. ఎటునుంచి వచ్చిందో… ఏమో… కానీ, బయట నుంచి ఓ నాగుపాము వచ్చి… నేరుగా శివాలయంలోకి ప్రవేశించింది. శివలింగానికి దగ్గరగా వెళ్లి… శివలింగాన్ని చుట్టేసింది. ఆ తర్వాత ఆ పాము తన పడగ ఎత్తి… అచ్చం శివుని మెడలో ఉన్నట్లే… నిలబడింది.
ఈ దృశ్యం చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. అందులోనూ శివరాత్రి రోజు జరిగింది. అందుకే ఈ వీడియోని మొబైల్ కెమేరాతో క్యాప్చర్ చేసి ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశారు, ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
View this post on Instagram