గత కొన్నేళ్లుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండు పాములు సంచరిస్తూ ఉన్నాయి. ఇటీవలికాలంలో అవి ఆలయ అంతరాలయంలో కూడా కనిపించి మాయమయ్యాయి. ఎప్పుడైతే ఈ పాములు ఆలయ ప్రాంతమంతా సంచరిస్తూ ఉన్నాయో… అప్పటినుంచీ అక్కడికి వచ్చే భక్తుల నుండీ విశేష పూజలు అందుకుంటూ వస్తున్నాయి.
ఇక అర్చకులు, కమిటీ సభ్యులు కూడా వీటిని దైవంగా భావించి… అత్యంత పవిత్రంగా భావిస్తూ వస్తున్నారు. అయితే ఏమైందో… ఏమో… తెలియదు కానీ, వాటిల్లో ఒక పాము ఉన్నట్లుండి ప్రాణాలు విడిచింది.
శుక్రవారం సాయంత్రం దుర్గా ఘాట్ దగ్గర ఉన్న ఓం టర్నింగ్ పాయింట్ వద్ద ఈ పాము చనిపోయి కనిపించింది. దానిని గమనించిన అర్చకులు, కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, పాముకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేశారు.