స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్బాస్. ఈ షోలో ప్రస్తుతం సీజన్ 5 విజయవంతంగా నడుస్తుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు మాత్రమే కాకుండా… సినీ సెలెబ్రిటీలు కూడా వీక్షిస్తుంటారు. ఈ నేపధ్యంలో కంటెస్టెంట్స్ కి కొందరు సెలెబ్రిటీలు తమ మద్దతుని కూడా తెలియచేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇక ఈ సీజన్ లో ఇంతకుముందు ఒకసారి ట్రాన్స్జెండర్ ప్రియాంకకే తన మద్దతు అని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. ఇక తాజాగా ఆల్ ఇండియా రియల్ హీరో సోనూసూద్ కూడా అదే బాట పట్టారు. అడిగినవారికే కాదు, అడగని వారికి కూడా తనకి చేతనైన సాయం చేస్తున్న ఈ రియల్ హీరో… ఇప్పుడు అడగకుండానే ఓ కంటెస్టెంట్ కి తన సపోర్ట్ అందించారు.
ఈ సీజన్లో పాల్గొన్న సింగర్ శ్రీరామ్ చంద్రని నేను సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఇన్స్టాలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. బిగ్బాస్ తెలుగు సీజన్ 5లో శ్రీరామచంద్రని చూస్తున్నారా? నేను చూస్తున్నాను. షోలో నా బెస్ట్ నువ్వే శ్రీరామ్ అంటూ కామెంట్ చేశారు.
View this post on Instagram