తాలిబన్ల అరాచకాలు, ఆకృత్యాలు చూస్తుంటే… అసలు హింస ముందు పుట్టి, ఆ తర్వాత వాళ్ళు పుట్టారేమో అనిపిస్తుంది. మానవత్వాన్ని మరిచి, హక్కులని కాలరాసి కాలకేయుల్లా విరుచుకు పడుతుంటే… వీళ్ళసలు మనుషులేనా అనిపిస్తుంది. అడుగడుగునా దాడులకి పాల్పడుతూ. పైశాచిక ఆనందాన్ని పొందుతుంటే… వీరి రాక్షసత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది.
కోరుకున్నదానిని పొందటం కోసం దేనికైనా తెగించే తత్వం వీరిది. అఫ్గనిస్తాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం ఎన్నో ఏళ్లపాటు ఉగ్రవాదాన్ని ప్రేరేపించారు. తీరా స్వాధీనం చేసుకున్న తర్వాత వీరి ఆగడాలు మరింత శ్రుతిమించాయి. దేశంలో అరాచక పాలన ప్రారంభించారు. ప్రజలని చిత్ర హింసలకి గురిచేశారు. వారికి ఎదురుతిరిగిన వారిని దారుణంగా చంపేసేవాళ్ళు. మహిళలని నానారకాలుగా వేధించారు. చివరికి ఇప్పుడు సైనిక అధికారులని కూడా విడిచిపెట్టలేదు.
తాజాగా ఆఫ్గనిస్తాన్కి చెందిన కొందరు మాజీ సైనికాధికారులని తమ బంధీలుగా చేసుకున్నారు. అయితే, మొదట్లో వీరిని విడిచి పెడతామని మాట ఇచ్చారు. కానీ, అలా చేయకుండా వారిపై దాడులకి దిగారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అవ్వటంతో… ఇది కాస్తా వైరల్ అయింది.
తాలిబన్ల దాష్టికానికి పరాకష్ట ఈ వీడియో. ఇందులో ఒక ఆఫ్ఘన్ ఆర్మీ ఆఫీసర్ ని సంకెళ్లతో కట్టేసి… అతని మెడపై కూర్చొని… మొహంపై చెంప దెబ్బలు కురిపిస్తూ… అత్యంత పాశవికంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా… అతన్ని బూటు కాళ్లతో తంతూ పైశాశిక ఆనందం పొందాడు. అది చాలదు అన్నట్లు ఈ విషయమంతా వారిలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలలో అప్ లోడ్ చేశారు.
Taliban tortures former army official Rahamatullah Qaderi. Qaderi was arrested last week. pic.twitter.com/5slH5tQs72
— Tajuden Soroush (@TajudenSoroush) December 27, 2021