టీమిండియా క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ కెప్టెన్సీకి చాలా గొప్ప పేరుంది. అలాగే, కపిల్ దేవ్ ఆట తీరన్నా, ఆయన వ్యక్తిత్వం అన్నా కూడా అంతే పేరుంది. గేమ్ స్టార్ట్ అయ్యాక మైదానంలో ఆడుతున్నంతసేపూ… కష్టపడేతత్వం, నిజాయితీ, వైవిధ్య భరితమైన ఆటతీరుతో ఎంతో మంది యువ క్రికెటర్లకి స్ఫూర్తిగా నిలిచారు కపిల్.
అయితే, ఎప్పుడూ తన భావోద్వేగాలని అదుపులో ఉంచుకుని ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రపంచ కప్ విజేతకి ఏమైందో… ఏమో… కానీ, సడెన్ గా తన స్టైల్ మార్చేశాడు. రకరకాల వేషదారణలతో, విన్యాసాలతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. అది చూసిన ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే… ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ యాప్ అయిన “క్రెడ్”… ఇండియన్ క్రీడాకారులలో వివిధ కోణాలను ఆవిష్కరించే వీడియోలని రూపొందిస్తుంది. అందులో భాగంగానే, గతంలో రాహుల్ ద్రావిడ్, నీరజ్ చోప్రా, వెంకటేష్ ప్రసాద్ తదితరులు ఇలాంటి యాడ్‌లో సందడి చేశారు. రీసెంట్ గా కపిల్ కూడా ఈ లిస్టులో చేరిపోయాడు.
అయితే, ఈ భారత మాజీ కెప్టెన్… బాలీవుడ్ హీరోని అనుకరించాడు. IPL 2021 ఫైనల్ జరిగిన రోజున ఈ యాడ్ సోషల్ మీడియాలో ప్రసారం అయ్యింది. అదికాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇందులో కపిల్ దేవ్… రణ్‌వీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్‌ని ఇమిటేట్ చేస్తూ… తన బాడీ లాంగ్వేజ్ కి భిన్నంగా కనిపించారు.
నిజానికి ఇప్పుడైతే కపిల్… రణ్‌వీర్ ని ఇమిటేట్ చేశారు కానీ, రణ్‌వీర్ మాత్రం ఎప్పుడో కపిల్ ని ఇమిటేట్ చేశాడు. 1983 వరల్డ్ కప్ ప్రధానాంశంగా రూపొందిన ’83’ మూవీలో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటించి మెప్పించాడు. దీనికి రివర్స్‌గా ఇప్పుడు కపిల్ దేవ్ రణ్‌వీర్ సింగ్ ఫ్యాషన్ స్టైల్ ని ఫాలో అయినట్లు తెలుస్తుంది.
కపిల్ దేవ్ ఈ వీడియోని షేర్ చేస్తూ… “Heads, I’m fashionable. Tails, I’m still fashionable”. అనే క్యాప్షన్ ని జత చేశారు. చూడబోతే, ఈ వీడియోల సక్సెస్ ఫార్ములా చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. ప్లేయర్స్ ని మునుపెన్నడూ చూడని కోణంలో చూపిస్తూ… ఆడియన్స్ కళ్లు చెదిరేలా చేస్తుంది.
Heads, I’m fashionable. Tails, I’m still fashionable. pic.twitter.com/vyKIrmLLOD
— Kapil Dev (@therealkapildev) October 15, 2021