బైక్ తో డేంజరస్ స్టంట్ చేయటం రీల్ లైఫ్ లో అయితే ఓకే కానీ, రియల్ లైఫ్ లో మాత్రం రిస్క్ తీసుకోవటమే అవుతుంది. ఒకవేళ అలాంటి ఫీట్స్ చేయాలనుకొంటే… ఏదైనా స్పెషల్ ప్లేస్ లో… ఎక్స్ పర్ట్స్ సూపర్ విజన్ లో చేయాలి. అంతేకానీ, పబ్లిక్ రోడ్డు మీద… మరీ ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రూట్స్ లో ఎంతమాత్రం సేఫ్ కాదు. ఒక్కసారి తేడా పడితే ఇక డైరెక్ట్ గా యమపురికే!
కానీ కొంతమంది ఉంటారు, అన్నీ తెలిసి కూడా ప్రాణాలతో చెలగాటమాడటం హాబీగా పెట్టుకుంటారు. అదేదో గొప్పలా ఫీలవుతూ కుటుంబానికి తీవ్ర శోకాన్ని మిగులుస్తారు. ప్రాణాలను ఫణంగా పెట్టి ఇలాంటి స్టంట్స్ చేయోద్దురా బాబూ! అని తరచూ పోలీసులు మొత్తుకుంటున్నా వినరు. ఈ విషయమై పలు సంస్థలు అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ… రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలన్న పిచ్చి వ్యామోహంలో పడిపోయి… వెర్రి చేష్టలు చేస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి విన్యాసాలే చేస్తూ… ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఓ వ్యక్తి బాగా రద్దీగా ఉన్న రోడ్డు మీద బైక్పై వెళ్తున్నాడు. వెళుతూ… వెళుతూనే సడెన్ గా స్టంట్లు చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో పక్కనుంచి వాహనాలు వస్తూ పోతూనే ఉన్నాయి. కొన్ని సెకన్లు అంతా సవ్యంగానే సాగింది. తర్వాత స్పీడ్ ఎక్కువై బైక్ అదుపు తప్పింది. దీంతో స్పీడ్ గా వెళ్లి ఎదురుగా వస్తున్న డంపర్ని ఢీకొట్టాడు. డంపర్ కూడా మంచి స్పీడ్ తో వస్తుండటంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి ఎగిరి అవతల పడ్డాడు. ఇంకేముంది జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
ఈ వీడియోని IPS ఆఫీసర్ రూపిన్ శర్మ ట్విట్టర్లో షేర్ చేస్తూ… ఇలాంటి డేంజరస్ స్టంట్స్ అస్సలు చేయకండి అంటూ కామెంట్ జత చేశారు.
#BeSafe💐
ऐसा मत करना😢😢😢😢Hero की Heropanti nikal gayi 😢😢😢@ipskabra @arunbothra @ipsvijrk pic.twitter.com/fHZ2mo7Rgb
— Rupin Sharma IPS (@rupin1992) October 27, 2021