దొంగిలిచడం ఓ ఆర్ట్ అయితే… దొరికిపోకుండా ఉండడం అంతకంటే ఓ గొప్ప ఆర్ట్. ఏదైనా ఒక వస్తువుని కావాలనుకున్నప్పుడు దానిని ఇతరులకు తెలియకుండా తీసుకోవడం చాలా కష్టమైన పనే! పొరపాటున వారికి పట్టుబడితే ఇంకేమైన ఉందా ? పరువు కాస్తా పోతుంది. చివరికి వారి ముందు తల దించుకోవాల్సి వస్తుంది.
ఇదంతా మనుషుల్లో అయితే సరే! మరి జంతువుల మాటేమిటి? అవి రాబరీ చేస్తూ పట్టుబడితే ఎలా ఫీలవుతాయి? వాటికి కూడా మనుషుల్లానే ఫీలింగ్స్ ఉంటాయా? ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.
ఓ పెట్ డాగ్ … తనకి బాగా ఆకలి వేసిందో ఏమో… గబ గబా కిచెన్ లోకి పరిగెత్తి… అక్కడ ర్యాక్ పై ఉన్న ఓ బాక్స్ ని దొంగిలించి… అతి కష్టమీద నోట కరుచుకుని వెళ్ళబోయింది. ఫుడ్ దొరికిందన్న సంతోషంలో తనని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారేమో అన్న సంగతి కూడా పట్టించుకోలేదు.
అయితే, ఇదంతా తన యజమాని గమనిస్తూ ఉంది. తలెత్తి చూసేసరికి ఎదురుగా యాజమాని కనిపించేసరికి ఖంగుతిన్నది. ఏం చేయాలో తోచలేదు. దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయానే… అన్న భావంతో తప్పు చేసినట్లుగా తల దించుకుంది. కుదిరితే క్షమించు… కుదరకపోతే శిక్షించు… ఏదో ఒకటి త్వరగా చేసేయ్… అన్నట్లు కొద్దిసేపు అలానే తలదించుకొని నిల్చొంది. చేతిదాకా వచ్చిన ఫుడ్ నోటికి అందకపోయేసరికి ఇక చేసేదేమీ లేక ఆ బాక్స్ అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
Caught ya 🤣🤣 pic.twitter.com/Z39TVM5yWN
— Rebecca (@beckx28) October 14, 2021