తెల్లారింది మొదలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, కొన్ని ట్రాజెడీగా, కొన్ని టెన్షన్ పుట్టిస్తే, ఇంకొన్ని ఆలోచింప చేసేవిగా ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయేలా చేస్తుంది. ఎలాగంటారా..! మీరే చూడండి!
కొంతమంది సాధువులు ఒకచోట కూర్చొని కీర్తనలు పాడుతూ… దేవుని భజన చేస్తున్నారు. వారిలో ఒక సాధువు ఒళ్లో కూర్చొని ఒక కోతి… మిగిలిన సాధువులతో కలిసి… దేవుని పట్ల భక్తితో… కర్తల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈ దృశ్యం అందర్నీ ఆశ్యర్యపరుస్తోంది.
సాదువులంతా కీర్తనలలో మునిగిపోగా… ఆ కోతి మాత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఆనందంతో భజన చేస్తుంది. ఎంతైనా వానరం… హనుమంతుని రూపం కదా! మరి గుండెల నిండా భక్తి కాక వేరే ఏముంటుంది చెప్పండీ!