These 5 Things to Avoid Lack of Money

చేతిలో డబ్బులు నిలవాలంటే… ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచండి..!

ఒక్కోసారి ఎంత సంపాదించినా… చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. వచ్చే డబ్బు వస్తానే ఉన్నా… పోయే డబ్బు పోతానే ఉంటుంది. ఎంత ఆలోచించినా ఇలా ఎందుకు జరుగుతుందో అస్సలు అర్ధం కాదు. 

 

లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో  పూజలు, వ్రతాలు చేస్తారు. నోములు, ఉపవాసాలు ఉంటారు. ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు ఎలాంటి ఫలితం ఉండదు. ఆ ఇంట్లో ఆర్ధిక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అప్పులపాలవుతూ ఉంటారు.

 

అయితే, దీనికో చక్కటి సొల్యూషన్ ఉంది. అదేంటంటే, ఇంట్లో కొన్ని రకాల వస్తువులని పెట్టుకోవటం ద్వారా ఈ సమస్య నుండీ బయట పడొచ్చు. సాదారణంగా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక వాస్తు దోషం ఉంటుంది. దానిని నివారించటం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. అందుకోసమై ఇంట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ క్రింద తెలిపిన 5 రకాల వస్తువులని మీ ఇంట్లో పెట్టుకున్నట్లైతే, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. అవేంటంటే – 

  1. గణేశ విగ్రహం: 

విఘ్నాలని హరించేవాడు వినాయకుడు అంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే… దాని తాలూకు వచ్చే ఆటంకాలని తొలగించాలంటే గణేశుని విగ్రహాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో అందరికీ కనపడే విధంగా ఉంచాలి.

      2.వేణువు: 

వాస్తు దోషాలు తొలగిపోవాలన్నా… ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలన్నా… వేణువు అత్యంత ప్రభావవంతమైన వస్తువు. అందుకోసం వేణువుని ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. 

        3. లక్ష్మీ, కుబేర విగ్రహం:

మన ఇంట్లో సంపద సిద్ధించాలంటే… లక్ష్మీ, కుబేరుల  ఆశీస్సులు తప్పక ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా లక్ష్మీ, కుబేరుల విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల… ఆ ఇంట్లో శాంతి, శ్రేయస్సు, సంతోషం వంటివి కలుగుతాయి. 

         4. శంఖం: 

వాస్తు శాస్త్రం ప్రకారం శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. శంఖం ఇంట్లో ఉంటే… లక్ష్మీదేవి ఉన్నట్లే! అలాగే, లక్ష్మీ దేవి చేతిలో శంఖం ఉన్న ఫొటో ఎక్కడైనా దొరికితే, వెంటనే కొని తెచ్చి పెట్టుకోండి. ఎందుకంటే, ఈ ఫోటో ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలనేవే ఉండవు.

         5. కొబ్బరికాయ: 

కొబ్బరికాయని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదం. మన ఇంట్లో కొబ్బరికాయను ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే!

 

పైన తెల్పిన ఈ 5 వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే… ఆ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులే ఉండవు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top