జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులు ఉన్నాయి. అందులో ప్రతీ రాశి కొన్ని ప్రత్యేకమైన గుణాలని కలిగి ఉంటుంది. అలా గుణగణాలని బట్టి ఆ వ్యక్తి స్వభావాన్ని అంచనా వేయవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని రాశులకి చెందిన వ్యక్తులు మొండి పట్టుదల కలిగి ఉండి… తమ నిర్ణయాలను తామే తీసుకొంటారట. ఇలాంటి వారిని నియంత్రించాలనుకోవడం చాలా కష్టమట. మరి ఆ రాశులేవో..! వారి స్వభావం ఏమిటో..! ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
ఈ రాశి వారు చూడటానికి ఎంతో సింప్లిసిటీతో ఉంటారు కానీ, స్ట్రాంగ్ లీడర్ షిప్ కలిగి ఉంటారు. తమకి తాము సొంత మార్గాన్నే రూపొందించుకుంటారు. అంతేకానీ, ఇతరులు చెప్పిన రూటు ఫాలో అవ్వరు. ఇంకా చూడటానికి చంచల మనస్తత్వం ఉన్నవారిలా కనిపిస్తారు కానీ, చాలా ధృడంగా ఉంటుంటారు.
మిథున రాశి:
ఈ రాశి వారు ఎంతో గోప్యంగా ఉంటుంటారు. తమ మనసులో మాట అస్సలు బయట పెట్టరు. ఏ అభిప్రాయమైనా తమలోనే ఉంచుకుంటారు. సిట్యుయేషన్ కి తగ్గట్టు తమని తాము మార్చుకోవటం వీరికి బాగా అలవాటు. ఇతరులకి ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి మనసులో ఏమున్నదో తెలుసుకోవటం చాలా కష్టం.
తులా రాశి:
ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిపైనా ఆధారపడరు. తమపై తాము పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు. ఒకరిని సహాయం కోరినప్పుడు కూడా తమకి తాము గ్రేట్ అని నమ్ముతారు. ఇక వీరి పర్సనల్ విషయాలు అయితే చాలా సీక్రెట్ మైంటైన్ చేస్తారు.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు రహస్యాలను తారుమారు చేయడంలో సిద్ద హస్తులు. వీరిని మోసం చేయడం అనుకున్నంత ఈజీ కాదు. ఎక్కువగా వీరు తమ సొంత అభిప్రాయాలకే కట్టుబడి ఉంటారు. ఇక ఒక్కసారి ఎవరైనా వీరి మనసుని కష్టపెడితే… ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా ప్రాణాంతకంగా ఉంటాయి.
ధనుస్సు రాశి:
ఈ రాశి వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడతారు. ఇతరుల నిర్ణయాలకు అనుగుణంగా వీరిని ఒప్పించడం చాలా కష్టం. తమ మనస్సు చెప్పినట్లు మాత్రమే నడుచుకొనే వ్యక్తులు వీళ్ళు.
మకర రాశి:
ఈ రాశి వారు ఎంతో నిజాయితీగా, నిష్కల్మషంగా ఉంటారు. వీరిని నియంత్రించడం చాలా కష్టంతో కూడుకొన్న పని. వీరు ఇతరుల మాట వింటారు కానీ గుడ్డిగా మాత్రం అనుసరించరు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇతరుల మాటను విన్నట్లు నటిస్తారంతే!