ముగ్గురు దొంగలు ఏకంగా అమ్మవారి హుండీనే టార్గెట్ చేసి… సీసీ కెమెరాకి అడ్డంగా బుక్కయ్యారు. మొదట సీసీ కెమెరాలు ఉన్న విషయం తెలియక… తమని ఎవరూ గమనించరు అనుకొని… చాలా తాపీగా తమ పని ముగిద్దాం అనుకున్నారు. కానీ చివర్లో కెమెరా కంటికి చిక్కారు.
నారాయణపేట డిస్ట్రిక్ట్ లో ఉన్న లోకాయపల్లి లక్ష్మమ్మ అమ్మవారి టెంపుల్ లో రాబరీ జరిగింది. ఈ రాబరీ కోసం తమతో తెచ్చుకున్న రాడ్డుని ఉపయోగించి హుండీ పగలగొట్టి… అందులో ఉన్న నగదుని కాజేశారు. ఈ క్రమంలో ఆలయంలో ఉండే సీసీ కెమెరాలని కూడా గమనించలేదు. తీరా రాబరీ పూర్తయ్యాక చూస్తే… ఎదురుగా సీసీ కెమెరా. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ సీసీ కెమెరాని ద్వంశం చేశారు. ఒక మహిళ, ఇద్దరు పురుషులు కలిసి ఈ చోరీకి పాల్పడ్డారు.
నిజానికి ఈ ఆలయం అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల దొంగతనం చేసినా తాము ఎవ్వరికీ పట్టుబడరన్న నమ్మకంతోనే ఈ ముఠా ఇంతటి సాహసానికి ఒడిగట్టింది. కానీ, ఊహించని రీతిలో బుక్కయింది.