ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తే… ఒక క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఏ ఆటలో అయినా గెలుపోటములు సహజం. కానీ, క్రికెట్ లో మాత్రం గెలుపు, ఓటమి అనేది కేవలం ఒకే ఒక్క క్యాచ్ పై ఆధారపడి ఉంటుంది. ఒక జట్టు స్కోర్ ని మలుపు తిప్పాలంటే… ఒక క్యాచ్ చాలు.
అయితే, రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో పట్టిన క్యాచ్… క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ క్యాచ్ పట్టుకోవడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ఫీల్డర్స్ ప్రయత్నించారు. కానీ, చివరికి ఏం జరిగిందో ట్విస్ట్.
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. అందులో జరిగే మార్ష్ కప్ టోర్నీలో… దక్షిణ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ జట్ల మద్య ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన సౌత్ ఆస్ట్రేలియా 48 ఓవర్లలో… 8 వికెట్లు కోల్పోయి… 391 పరుగులు చేసింది.
తర్వాత వర్షం కారణంగా క్వీన్స్‌ల్యాండ్‌కి 44 ఓవర్లలో… 380 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చారు. ఈ టార్గెట్ ని రీచ్ అయ్యే క్రమంలో క్వీన్స్‌ల్యాండ్ టీమ్ 40.3 ఓవర్లలో… 312 పరుగులు చేసి… ఆలౌట్ అయింది. దీంతో 67 పరుగుల తేడాతో సౌత్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో విన్ అయింది.
ఇదిలా ఉంటే… క్వీన్స్‌ల్యాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, 37వ ఓవర్ రన్నింగ్ లో ఉండగా… బ్యాటింగ్ చేస్తున్న మైఖేల్ నాసర్… భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా… ఆ బంతి కాస్తా అమాంతం గాల్లోకి లేచింది. ఇక ఆ బాల్ ని క్యాచ్ పట్టటానికి ఫీల్డ్ లో ఉన్న ముగ్గురు సౌత్ ఆస్ట్రేలియా ఫీల్డర్స్ బౌండరీ లైన్ వైపు పరిగెత్తారు.
వీరిలో ఒక ఫీల్డర్ ఆ బంతిని క్యాచ్ పట్టుకున్నా… అతడు అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరాడు. ఇక మరో ఇద్దరు ఫీల్డర్స్ కూడా బౌండరీ లైన్ అవతలే ఉండి బాల్ ని క్యాచ్ పట్టుకోలేక పోయారు. దీంతో చివరికి వీరి ప్రయత్నమంతా నీరుకారిపోయింది. ఇక్కడ గొప్ప ట్విస్ట్ ఏమిటంటే, అంపైర్ దాన్ని సిక్స్‌గా పరిగణించాడు.
Trying to salvage something out of 2021 😝 #MarshCup pic.twitter.com/WLxxeCHeWL
— cricket.com.au (@cricketcomau) October 13, 2021