Toddler Girl Drinks Elephant Milk

ఏనుగుతో ఆటలాడుతూ… పాలు తాగుతున్న చిన్నారి (వీడియో)

పసిపిల్లలు ఆవు పాలు తాగడమో… గేదె పాలు తాగడమో… మేక పాలు తాగడమో… లేదంటే గాడిద పాలు తాగడమో… చూస్తుంటాం. అంతేకానీ, ఏనుగు పాలు తాగటం ఎప్పుడైనా చూశారా..! 

కానీ, ఓ చిన్నారి ఏకంగా ఏనుగు పాలే తాగేస్తోంది. అదికూడా ఏనుగు కిందకి దూరి… దాని పొదుగు నొక్కుతూ… పాలు తాగేస్తోంది. 

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకి చెందిన హర్షిత బోరా అనే 3 ఏళ్ల చిన్నారి ఏనుగుతో ఆడుకుంటూ… ఆకలేసినప్పుడు  దాని పాలు పితుక్కొని తాగేస్తోంది. అయితే ఆ ఏనుగు వారి పెంపుడు ఏనుగు. మావటి కుటుంబానికి చెందిన ఆ చిన్నారికి మొదటినుంచీ ఆ ఏనుగుతో ఆడుకోవటం అలవాటే! అందుకే ఏనుగు కూడా పాలు తాగుతుంటే కాదనకుండా తన బిడ్డకి ఇస్తున్నట్లే అనుకొని ఆ చిన్నారికి కూడా పాలిస్తోంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top