టొయోటా కంపెనీ జులైలో కొత్త అర్బన్ క్రూజర్‌ను లాంచ్ చేసింది. అదే టొయోటా హైరైడర్. ఈ సెక్షన్ లో లాంచ్ అయిన మొట్టమొదటి పూర్తిస్థాయి హైబ్రిడ్ కారు. ఇది ఒక సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టం కలిగి ఉన్న కారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కలిగి ఉండి… ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 100 hp, పీక్ టార్క్ 135 nm గా ఉంది. ఇంజిన్, మరియు హైబ్రిడ్ మోటార్ పవర్‌ను కలిపినపుడు పవర్ అవుట్‌పుట్ 113 hp గా ఉంది.
ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ కలిగి ఉన్న మొట్ట మొదటి కారు కూడా ఇదే! ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ చార్జర్, 9 ఇంచెస్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, వెంటిలేటెడ్ డ్యూయల్ టోన్ సీట్లు కలిగి ఉంది. ఇంకా 6 ఎయిర్ బ్యాగ్ లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, ఆల్ వీల్ డిస్కులు కూడా ఉన్నాయి. అయితే దీని ధర ప్రకటించలేదు.
తాజాగా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ హైబ్రిడ్ వెర్షన్ ధరను కంపెనీ అఫిషియల్ గా లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్ ఎస్-ట్రిమ్ ధర రూ.15.11 లక్షలు; టాప్ ఎండ్ వీ ట్రిమ్ ధర రూ.18.99 లక్షలు; జీ వేరియంట్ ధర రూ.17.49 లక్షలు. కాగా, ఈ హైరైడర్ 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ రకంగా చూస్తే… రూ.20 లక్షల్లోపు ఉండే బెస్ట్ కార్ల లిస్ట్ లో ఇది ఖచ్చితంగా ప్లేస్ దక్కించుకుంది.