ఈ భూమి మీద మనుషులతో పాటూ రక రకాల జంతువులు, పక్షులు మరియు కొన్ని రకాల సరీసృపాలు నివసిస్తూ ఉంటాయి. అయితే, జంతువులను, మరియు పక్షులను కొంతమంది ఇష్టపడతారు, మరి కొంతమంది ప్రేమిస్తారు.
అయితే, పాములు అంటే చాలా మందికి భయమెక్కువ. ఎందుకంటే, అది ఎక్కడ మనల్ని కాటేస్తుందో… మన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో… అని చాలా మంది పాములకు దూరంగా ఉంటారు. మరి కొందరు అయితే వాటితో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అదే వారి పని కూడా.
ఇదిలా ఉంటే… పామును చూస్తేనే మనకి ఒళ్లు ఝలదరిస్తుంది కదా! అలాంటిది ఒకే చోటు రెండు పాములను చూస్తే.. మరి ఇంకేముంది మన పని అయిపోయినట్లే! గుండె జారిపోతుంది కదూ..! అలాంటిది ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ప్రేక్షకులను తెగ ఆనంద పరుస్తూ ఉంది.
తాజాగా “దీపక్ కుమార్ సింగ్” అనే ఒక నెటిజన్ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ పాముల వీడియోను చూస్తే మీకు కూడా తప్పకుండా షాకింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో రెండు పాములు ఎంచక్కా ఒకటికి ఒకటి జతగా కలిసి సంతోషంతో సేద తీరుతూ… ఆడుతూ పాడుతూ… ఒకదానితో మరొకటి సయ్యాటలు ఆడటం మనం చూడవచ్చు. మరి లేట్ ఎందుకు మనము కూడా చూసేద్దాం పందండి.
A pair of Indian Cobra enjoying cool weather at #Patna Zoo.With their threatening hoods and intimidating upright postures, they’re considered among some of the most iconic snakes on planet. Their elegance, prideful stance and venomous bite have made them both respected and feared pic.twitter.com/YvoU0hGSXu
— Dipak Kumar Singh (@DipakKrIAS) October 30, 2021