ఈ భూమిపై ఎన్నో ఆధారాలను సముద్రం తన గర్భంలో దాచేసుకుంటుంది. అయితే, వాటి తాలూకు ఆనవాళ్ళను మాత్రం మనకి వదిలేస్తుంటుంది. ఆ ఆనవాళ్ళు దొరికిన రోజు నుంచీ ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వాటిలో కొన్ని సాల్వ్ చేసినా… మరికొన్ని మాత్రం ఎప్పటికీ మిస్టరీలు గానే మిగిలి పోతాయి. అలాంటి అంతుచిక్కని రహస్యమే ఈ కుమారి ఖండం. ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్ లో లేని ఈ మిథికల్ లాస్ట్ కాంటినెంట్… ఎప్పుడు ఎలా వ్యానిష్ అయిందో… తిరిగి అది ఎలా ఎక్స్ ప్లోర్ చేయబడిందో ఈ స్టోరిలో క్లియర్ గా తెలుసుకుందాం.
అసలు కుమారి కండం అంటే ఏమిటి?
కుమారి ఖండం అనేది గ్రేటర్ ఇండియాలో ఉన్న ఏన్షియంట్ తమిళ్ సివిలైజేషన్ కి సంబంధించిన ఏన్షియంట్ టెర్రిటరీ. ఇది శివుని నుండి తమిళ భాష పుట్టిన ప్రదేశం. ఇక్కడ తమిళ ‘అగతియం’ యొక్క తొలి సాహిత్య రచనలు ప్రచురించబడ్డాయి.
అగతియం అనేది ఫస్ట్ సంగం పీరియడ్ లో గ్రేట్ సేజ్ అయిన అగతియార్ అంటే – అగస్త్య ముని తమిళ్ లో రాసిన మొట్టమొదటి గ్రంధం. దీనిని బట్టి చూస్తే… ఈ భూభాగం వేద కాలం ప్రారంభానికి ముందు అలాగే రామాయణ, మహాభారత కాలానికంటే ముందే అభివృద్ధి చెందింది.
‘సంగం యుగం’ అనేది సౌత్ ఇండియాలో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 3వ శతాబ్దం వరకు ఉన్న కాలం. ఏన్షియంట్ సౌత్ ఇండియాలో ‘ముచ్చంగం’ అని పిలువబడే 3 సంగమములు ఉండేవని తమిళ్ మైథాలజీ చెబుతుంది. మధురై పాండ్య రాజుల రాచరికపు పోషణలో ఈ సంగమాలు అభివృద్ధి చెందాయి. వీరి పాలనా సమయంలో జరిగిన కవులు మరియు పండితుల సమ్మేళనం నుండి ఈ పేరు వచ్చింది. “సంగం” అనే పదానికి సాహిత్యపరంగా “సంగమం” అని అర్థం.
మొత్తం సంగం యుగంలో మూడు రాజవంశాలు పాలించబడ్డాయి. అవే – చేరులు, చోళులు మరియు పాండ్యులు. ఈ రాజ్యాల ఎవిడెన్స్ కి సంబందించిన కీ సోర్సెస్ అన్నీ సంగం కాలం నాటి లిటరరీ వర్క్స్ లో క్లియర్ గా ఎక్స్ ప్లెయిన్ చేయబడి ఉంటాయి. అందుకే సంగం లిటరేచర్ ని సౌత్ ఇండియాలోని ఫస్ట్ లిటరేచర్ గా చెప్పుకోవచ్చు. దీని గురించి పాత తమిళ గ్రంథాలలో వివరించబడింది. ఇక కుమారి ఖండం కూడా ఈ రాజుల కాలానికి చెందినదే! స్ట్రెయిట్ గా చెప్పాలంటే, ఈ కుమారి ఖండం భూమి పుట్టిన కొత్తలోనే ఏర్పడింది.
కుమారి ఖండం భూభాగం మొత్తం పరిమాణం శ్రీలంక పరిమాణం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. అందుకే దీనిని గ్రేటర్ ఇండియా యొక్క సబ్ కాంటినెంట్ గా పిలుస్తారు. అలాగే దాని పేరులో కూడా ‘ఖండం’ అనే పదం ఉంది.
నిజానికి కుమారి ఖండం అనేది అసలు లేదనీ… కేవలం ఇది ఒక మిధ్ అని కొందరంటే… కాదు, ఇది తమిళుల యొక్క ఫెయిరీ టేల్ అని కొందరంటారు. ఇంకొందరైతే ఈ ఖండం నిజమైనదే అనీ… ఇది కోల్పోయిన ‘లెమురియా ఖండం’ అని అంటున్నారు. దీనికి సరైన ఆధారాలు మన దగ్గర లేనప్పటికీ, చరిత్రలో చాలాసార్లు దీని గురించి ప్రస్తావించ బడింది.
కుమారి కండం యొక్క పౌరాణిక మూలం
తమిళ్ ఫోక్ టేల్స్ ప్రకారం, కుమారి ఖండం అనేది సౌత్ ఇండియాలో ఉన్న ఏన్షియంట్ అండ్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్. ఇది పాండియన్ రాజుల యొక్క జ్ఞానం మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉన్న భూమిగా చెప్పబడింది. ఒకానొక సమయంలో వచ్చిన భారీ వరదల కారణంగా ఈ కాంటినెంట్ సముద్రంలో మునిగిపోయి… పూర్తిగా కనిపించకుండా పోయింది. ఇప్పుడాప్లేస్ లో దీని తాలూకు ఆనవాళ్ళు కూడా ఏమీ లేవు. ఒకానొకప్పుడు ఇక్కడ ఒక ఖండం అనేది ఉందని కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.
కుమారి కండం యొక్క భౌగోళిక ఆధారాలు
కుమారి ఖండం అనేది మడగాస్కర్, సౌత్ ఇండియా మరియు ఆస్ట్రేలియాలను కలుపుతూ ఏర్పడిన ఒక భారీ భూభాగం అని చాలా మంది రీసర్చర్స్ చెప్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం ఇది మడగాస్కర్ మరియు ఆస్ట్రేలియాకు అసలు కనెక్ట్ కాలేదు, కేవలం సౌత్ ఇండియాకి మాత్రమే కనెక్ట్ అయి ఉందని వాదిస్తారు. స్ట్రెయిట్ గా చెప్పాలంటే, ఇది గ్రేటర్ ఇండియాలోని సింగిల్ పీస్ అఫ్ ల్యాండ్.
సుమారు 100 మిలియన్ సంవత్సరాల క్రితం, గోండ్వానా యొక్క తూర్పు భాగమంతా… మడగాస్కర్, ఆస్ట్రేలియా, ఇండియా మరియు అంటార్కిటికాలతో కూడిన ఓ సూపర్ కాంటినెంట్. కరూ-ఫెర్రార్ ఇగ్నియస్ ప్రావిన్స్ కి వచ్చిన వరద కారణంగా విడిపోవటం ప్రారంభించింది. మడగాస్కర్ గోండ్వానా నుండి విడిపోయి ఇండో – ఆస్ట్రేలియన్ ప్లేట్‌లో చేరింది. ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా నుండి నార్త్-వెస్ట్ డైరెక్షన్ కి కదలడం ప్రారంభించింది. అప్పుడు భారతదేశం మరియు అంటార్కిటికా మధ్య మొదటి సముద్రపు అడుగుభాగం ఏర్పడింది.
ఉత్తరం వైపు మైగ్రేట్ అయి వెళ్ళేటప్పుడు, 65 మిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన రీయూనియన్ వాల్కెనో హాట్‌స్పాట్ ఎరప్షన్ కారణంగా సీషెల్స్ నుండి రీయూనియన్ వరకు విస్తరించి ఉన్న మడగాస్కర్ మరియు మస్కరెన్ పీఠభూమి భారతదేశం నుండి విడిపోయాయి. భారతదేశం – మడగాస్కర్ – సీషెల్స్ విభజన భారతదేశం యొక్క డెక్కన్ ట్రాప్స్‌తో సమానంగా ఉంటుంది. ఈ ఎరప్షన్ ఇండియాలో డెక్కన్ ట్రాప్‌లను నెలకొల్పింది. ఇది విపరీతమైన బసాల్ట్ లావా బెడ్‌ను సృష్టించింది. అదే సమయంలో సీషెల్స్ మరియు మడగాస్కర్‌లను భారతదేశం నుండి వేరుచేసే చీలికను తెరిచింది.
అప్పుడు ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వైపు మూవ్ అవటం స్టార్ట్ అయింది. భూమధ్యరేఖను దాటి యురేషియా ప్లేట్‌తో కలిసిపోయింది. ఇప్పటికీ, ఇండియన్ ప్లేట్ సంవత్సరానికి 1.4 ఇంచెస్ స్పీడ్ తో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో కదులుతోంది. యురేషియన్ ప్లేట్ కూడా నార్త్ ఈస్ట్ వైపు కదులుతోంది, ఇండియన్ ప్లేట్ కంటే చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో, ఇది యురేషియన్ ప్లేట్ డిజేబులిటీకి కారణమవుతుంది. దీనివల్ల ఇండియన్ ప్లేట్ సంవత్సరానికి 0.6 ఇంచెస్ చొప్పున కంప్రెస్ అవ్వొచ్చు.
సుమారు 3 మిలియన్ సంవత్సరాల క్రితం, ఇండియన్ ప్లేట్ మరియు ఆస్ట్రేలియన్ ప్లేట్ రెండూ కూడా క్యాప్రికార్న్ ప్లేట్ తో సపరేట్ చేయబడ్డాయి. ఇప్పుడు అవి బౌండరీస్ దాటి ఎక్స్ ప్యాండ్ అయ్యాయి.
కుమారి ఖండం యొక్క ఎగ్జిస్టెన్స్ ని పాయింట్ అవుట్ చేసేవాళ్ళు ఇండియన్ ఓషన్ లోని జియోలాజికల్ ఫీచర్స్ ని ఈ లాస్ట్ కాంటినెంట్ యొక్క అవశేషాలు గా సూచిస్తారు. రామ సేతుగా పిలవబడే ఆడమ్స్ బ్రిడ్జ్ యొక్క రాక్ ఫార్మేషన్స్ చైన్ అండర్ వాటర్ లో ఉండటం వల్ల ఈ ల్యాండ్ ఒకప్పుడు ఇండియా మరియు శ్రీలంకని కనెక్ట్ చేసే ల్యాండ్ బ్రిడ్జ్ లో భాగమని కొందరు ఊహించారు.
జియోలాజికల్ థియరీలన్నీ ఇండియన్ ఓషన్ లో ప్రీ-హిస్టారిక్ టైమ్ లో ఉండే ల్యాండ్ ఎగ్జిస్టెన్స్ ని సజెస్ట్ చేస్తున్నాయి. లాక్కాడివ్-చాగోస్ రిడ్జ్ వంటి సబ్ మెర్జ్ అయిన జియోలాజికల్ ఫార్మేషన్స్ అన్నీ ఈ లాస్ట్ కాంటినెంట్ యొక్క రెసిడ్యువల్స్ గా పేర్కొనబడ్డాయి.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కన్యాకుమారి నగరం మొట్టమొదట కుమారి ఖండంలో భాగంగా ఉండేదట. అప్పట్లో తమిళనాడుతో సహా భారతదేశం మొత్తం కుమారి ఖండంలో భాగం. చివరి మంచు యుగం ముగిసినప్పుడు, సముద్ర మట్టాలు పెరిగినప్పుడు ఈ కుమారి ఖండం మునిగిపోయింది. తమిళ ప్రజలు ఆ తరువాత ఇతర దేశాలకు మైగ్రేట్ అయ్యారు. ఇది ఇతర సమూహాలతో కలిసి, కొత్త జాతులు, భాషలు, నాగరికతలు ఏర్పడటానికి దారితీసింది.
ఇది కూడా చదవండి: Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology
ప్రాచీన తమిళ సాహిత్యంలో కుమారి ఖండం గురించి
కుమారి ఖండం గురించి రిఫరెన్సెస్ అన్నీకూడా ఏన్షియంట్ తమిళ్ లిటరేచర్ లో, ముఖ్యంగా సంగం లిటరేచర్ లో కనిపిస్తాయి. ఈ స్క్రిప్చర్స్ డిఫెరెంట్ సెక్టార్స్ లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ తో డెవలప్ అవుతున్న సివిలైజేషన్ గురించి మాట్లాడుతున్నాయి. కుమారి ఖండం ఎగ్జిస్టెన్స్ గురించి రిఫరెన్సెస్ ని కలిగి ఉన్న “సిలప్పతికారం” మరియు “మణిమేకలై” వంటి ఏన్షియంట్ తమిళ్ లిటరేచర్ లోని సజెషన్స్ ని ప్రతిపాదకులు సూచిస్తున్నారు.
1920 లలో, లెమోరియా భావన ఇండో-ఆర్యన్ సంస్కృతుల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి తమిళ భాషని పునరుద్ధరించటానికి ప్రాచుర్యం పొందింది. తమిళ పునరుద్ధరణ రచయితలు లెమురియా, దాని ముంపుకు ముందు, అసలు తమిళ మాతృభూమి ఇదేననీ, తమిళ్ సివిలైజేషన్ యొక్క బర్త్ ప్లేస్ ఇదే అని పేర్కొన్నారు.
ఇక తమిళ రచయితలు కుమారి ఖండాన్ని ఒక ఏన్షియంట్ కాంటినెంట్ అనీ, అది మోస్ట్ మోడ్రెన్ సివిలైజేషన్ కలిగి ఉందనీ, అయితే ఇప్పుడది ఇండియన్ ఓషన్ లో ఐసోలేటెడ్ కాంటినెంట్ గా ఉందనీ పేర్కొన్నారు. అది తమిళ భాష మాట్లాడేవారు మాత్రమే నివసించే నాగరికతకి చెందినది అని కూడా వర్ణించారు.
కుమారి ఖండం యొక్క సివిలైజేషన్ సుమారుగా క్రీస్తు పూర్వం 50,000 సంవత్సరాల క్రితమే వృద్ధి చెందిందని, అయితే, క్రీస్తు పూర్వం 16,000 సంవత్సరాల క్రితం ఈ ఖండం మునిగిపోయిందని పేర్కొన్నారు. తమిళం ప్రపంచంలో అన్ని ఇతర భాషల యొక్క మాతృభాష అని నమ్ముతారు. చాలా సంస్కరణల ప్రకారం, కుమారి ఖండం అసలు సంస్కృతి తమిళనాడులో ఉనికిలో ఉంది. లెమురియా మానవ జాతి జన్మస్థానం అని వ్రాసారు. మానవులు మాట్లాడిన మొట్టమొదటి భాష తమిళం. ఈ వాదనలు 20వ శతాబ్దంలో తమిళనాడులోని స్కూల్స్ మరియు కాలేజ్ టెక్స్ట్ బుక్స్ లో కూడా పొందుపరిచారు
కుమారి ఖండంలో భాషా మరియు సాంస్కృతిక సంబంధాలు
కుమారి ఖండం యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి సపోర్టర్స్ తరచుగా తమిళ్ కల్చర్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ సివిలైజేషన్ మధ్య లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ సిమిలారిటీస్ గురించి హైలైట్ చేస్తారు. ఈ కనెక్షన్స్ లాస్ట్ సివిలైజేషన్ లో ఏన్షియంట్ లెగసీని సూచిస్తాయని కొందరు వాదించారు. కొంతమంది పండితులు తమిళ భాషకు మనకి తెలిసిన చరిత్రలో ఉన్న దానికంటే చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉందని వాదించారు. ఇది కుమారి ఖండం వంటి పురాతన నాగరికత దాని జన్మస్థలంగా ఉండవచ్చని వారు ఊహించారు.
కుమారి ఖండం యొక్క వైభవం
జియోలాజికల్ గా చూస్తే, కుమారి ఖండం కేరళ మరియు తమిళనాడును ఆనుకుని కన్యాకుమారి చివరన ఉంది. దాని మధ్యలో పవిత్రమైన ‘కుమారి మలై’ అనే ఓ పర్వతం కూడా ఉంది. దాని నుండి నాలుగు నదులు ఉద్భవించాయి. అవి పెరూ నది, కుమారి నది, పహ్రులి నది మరియు కన్ని నది.
ఇక ఈ సబ్ కాంటినెంట్ మధ్యలో ఉన్న పవిత్ర పర్వతాన్ని ‘పెరు మలై’ అని పిలుస్తారు. నిజానికిది పవిత్రమైన మేరు పర్వతం. కుమారి ఖండం తమిళనాడు చివరిలో ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం మరియు పశ్చిమాన అరేబియా సముద్రం ఉన్నాయి. ఇది భూమిపై జీవితం ప్రారంభమైన ప్రదేశం. ఇంకా ఇది పరమ శివుని దివ్య భూమి.
తమిళ ప్రజలు ఏన్షియంట్ నేచర్ వర్ షిప్ యొక్క సోర్సెస్ ని క్లోజ్ గా ఫాలో అవుతూ వచ్చారు. వాళ్ళు పరమశివుని తమ దేవుడిగా ఆరాధించారు. ఈ ప్రాచీన తమిళ భూమిలో కుల వ్యవస్థ లేదు.
పురాణాల నుండి వచ్చిన కుమారి ఖండం
కుమారి ఖండం గురించి సంస్కృత భాషని వ్యతిరేకించిన వారే ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ, అసలు ఈ కుమారి ఖండం అనే పదమే సంస్కృత మూలం. “కుమారి”, “కందం” అనే పదాలు రెండూ సంస్కృతంలోనివే. ఇక్కడ “కందం” అంటే “ఖండం” అని అర్ధం.
హిందూ కాస్మోలజీ ప్రకారం మల్టీ యూనివర్స్, మల్టీ వరల్డ్స్, అలాగే మల్టీ లైఫ్ థియరీస్ ని ఇది నమ్ముతుంది. అందుకే స్కంద పురాణం ఒకప్పుడు కుమారి ఖండం అని పిలువబడే గ్రహాంతర ప్రపంచం గురించి కీర్తించబడిన రాజ్యం గురించి మాట్లాడుతుంది.
ఈ భారీ ఉపఖండం పాండ్యుల కాలంలో అభివృద్ధి చెందింది. పురాతన తమిళకమ్ ని పాలించిన పాండ్య సామ్రాజ్యానికి చెందిన వారిలో మొత్తం 72 మంది రాజులు ఉన్నారు.
“కుమారి ఖండం” అనే పదము మొదట స్కంధ పురాణములోని 15వ శతాబ్దపు తమిళ్ వెర్షన్ అయిన కంద పురాణములో కనిపిస్తుంది. అప్పటి రాజైన పరాటన్ కి ఎనిమిది మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతను తన రాజ్యాన్ని తొమ్మిది భాగాలుగా విభజించాడు. అతని కుమార్తె కుమారి పాలించిన భాగమే ఈ ప్రాంతం. ఆమె తర్వాత అదికాస్తా కుమారి ఖండం గా మారింది. ఇది ఈ పేరుకు సంబంధించి పురాణాలలో ఉన్న ఓల్డెస్ట్ రిఫరెన్స్ గా మనం చెప్పుకోవచ్చు.
ఇది కూడా చదవండి: పూరీ జగన్నాథుని రత్న భండార్ లో దాగి ఉన్న మిస్టరీ..?
సైన్స్ నుండి కుమారి ఖండం
19th సెంచరీకి చెందిన హిస్టారియన్స్, మరియు జియాలజిస్టులు లాస్ట్ కాంటినెంట్స్ థియరీ గురించి ప్రతిపాదించారు. ఇది మహాసముద్రాలచే వేరు చేయబడిన భూభాగాల మధ్య జియాలజీ, జంతుజాలం మరియు వృక్షజాలంలో కనిపించే సిమిలారిటీస్ గురించి వివరిస్తుంది.
ఈ రకంగా వీళ్ళు ఇండియా మరియు మడగాస్కర్ ద్వీపకల్పం మధ్య లెమురియా అనే కోల్పోయిన ఖండాన్ని కనుగొన్నారు. తమిళ రచయితలు మరియు కవులు లెమురియా పేరును కుమారి ఖండంగా మార్చడం ద్వారా తమిళియన్స్ కి ఈ సైంటిఫిక్ థియరీని పరిచయం చేశారు. ఇది తమిళులు గతంలో కలిగి ఉన్న అలాగే ఇప్పుడు కోల్పోయిన గ్లోరియస్ లాండ్ పై విశ్వాసానికి దారితీసింది.
కుమారి ఖండం కోల్పోవటం
కాంటినెంటల్ డ్రిఫ్ట్ ప్రకారం, కాంటినెంటల్స్ బ్రేక్ అవుతుంటాయి, మూవ్ అవుతుంటాయి, ఇంకా ఒకదానితో ఒకటి మెర్జ్ అవుతుంటాయి. ఇండియా అండ్ మడగాస్కర్ కూడా అలాంటి భూభాగాలలో ఒకటి. ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ డ్రిఫ్ట్… యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్‌తో మెర్జ్ అయింది. ఆ మెర్జింగ్ లైన్ కాస్తా హిమాలయాలుగా మారింది. అది అక్కడితో ఆగిపోలేదు, ఆ ప్లేట్ ఇప్పటికీ మూవ్ అవుతోంది అందుకే హిమాలయాలు సంవత్సరం సంవత్సరానికీ పెరిగిపోతూ వస్తున్నాయి.
ఇక కుమారి ఖండం గ్రాడ్యువల్ గా డిజప్పియర్ అవుతూ వచ్చింది. ఒకవేళ అది నిజంగా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్లయితే, ఖచ్చితంగా కారకాల కలయికకు కారణమయ్యేదని చెప్పవచ్చు. ఐస్ బర్గ్ లు మెల్ట్ అవటం, టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్ అవ్వటం కారణంగా సీ లెవెల్స్ పెరగడం వల్ల కోస్టల్ ఏరియాలన్నీ సబ్ మెర్జ్ అవుతాయి. సునామీలు లేదా ఎర్త్ క్వేక్స్ వంటి డిజాస్టర్స్ ఈ ప్రాసెస్ ని యాక్సలరేటెడ్ చేసి, ఫైనల్ గా ఆ కాంటినెంట్ సబ్ మెర్జ్ అవ్వటానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి.
రాజకీయ సాధనంగా మారిన కుమారి ఖండం
ఈ టాపిక్ మీద రీసెంట్ గా డీప్ డిస్కర్షన్ జరిగింది. “తమిళ్ కంట్రీ” అనే పొలిటికల్ ఐడియాలజీ పెరగడానికి కూడా ఇది కారణమయింది. వ్యక్తులు తమ పొలిటికల్ స్పేస్ ని క్రియేట్ చేసుకోవటం కోసం తమిళ్ ప్రైడ్ ని రెన్యూ చేయాలని ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా యాక్సలరేట్ చేసిన అదర్ కాన్స్పిరసీ థియరీస్ తో పాటు ఈ థియరీకి కూడా లైఫ్ ఇచ్చారు. ఇలా లాస్ట్ కాంటినెంట్ అయిన కుమారి ఖండం టాపిక్ ని ఓ పొలిటికల్ టూల్ లా వాడుతున్నారు
చివరిమాట
ఫైనల్ గా ఈ టాపిక్ గురించి మనకి ఏం అర్ధమవుతుందంటే, ఈ భూమిపై మన జీవితం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితమే ప్రారంభమైందనీ, కుమారి ఖండం అనేది మనం కోల్పోయిన నాగరికత అనీ తెలుస్తోంది. ఇదేకాదు, చరిత్రని త్రవ్వే కొద్దీ ఇలాంటి ఎన్నో అంతరించి పోయిన నాగరికతలకి సంబందించిన ఆనవాళ్ళు దొరుకుతూనే ఉంటాయి. అవన్నీ మన దేశ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్తున్నాయి.