బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ హీరోగా తెరకెక్కుతున్న ‘అన్‌స్టాపబుల్ అన్‌లిమిటెడ్ కామెడీ’ టీజర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈరోజు విడుదల చేశారు. వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ నవ్వించేలా ఉంది మరియు చాలా సరదాగా అందరినీ అలరించింది.
పోసాని కృష్ణ మురళి, రఘుబాబు, పృథ్వీ, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి, రోహిణి, విక్రమాదిత్య, గీతా సింగ్, రూపా లక్ష్మి, చమ్మక్ చంద్ర తదితర హాస్యనటులు ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. డైమండ్ రత్న బాబు దర్శకత్వం వహించగా, రజిత్ రావు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.