ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించింది. ప్రజలు ఈ AI-ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
మిడ్‌జర్నీ నుండి చాట్ GPT వరకు, ప్రపంచం AIతో ఉర్రూతలూగుతుంది. , ప్రపంచవ్యాప్తంగా కొందరు కళాకారులు ఈ AI టెక్నాలజీని ఉపయోగించి విచిత్రమైన ఫోటోలను రూపొందిస్తున్నారు.
ఇప్పుడు సాహిద్ అనే ఫోటోగ్రాఫర్ బాలీవుడ్ బ్యూటీస్ వృద్ధుల వేషధారణతో ఉంటే ఎలా ఉంటారో ఊహించి ఆ ఫోటోలను పంచుకున్నారు.
ఈ ఫోటోగ్రాఫ్‌లు ఆన్లైన్లో చాలామంది దృష్టిని ఆకర్షించాయి. చాలా మంది వ్యక్తులు ఈ ఫోటలపై స్పందించారు.
నిజానికి తమ నటనతో ఎంతో ఆకట్టుకున్న ఈ యంగ్ బ్యూటీలు భవిష్యత్తులో ఎలా ఉంటారో ఈ ఫోటోలు తెలియచేస్తున్నాయి.
అంతేకాదు, తమ అభిమాన నటి సడెన్ గా ముసలిదైపోతే ఇలా ఉంటుందా అని ఫ్యాన్స్ షాక్ అయ్యేలా ఈ చిత్రాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా!
AI తల్చుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని మరోసారి ప్రూవ్ అయింది. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు దానికి దాసోహం అంటుంది.
ఫైనల్ గా ఈ ఫోటోలు మనకి ఏమని మెసేజ్ ఇస్తున్నాయంటే... "శారీరక సౌందర్యం నశ్వరమైనది, కానీ అంతర్గత సౌందర్యం శాశ్వతమైనది" అని.