యూట్యూబర్ హర్షసాయి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. సోషల్ మీడియాలో అంతలా సెన్సేషన్ క్రియేట్ చేశాడితను.
హర్షసాయి ఓ వ్యక్తి అనేకంటే ఓ బ్రాండ్ అంటే బాగుంటుంది. ఎందుకంటే సోషల్ సర్వీస్ తో తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.
యూట్యూబర్‌గా ఉంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయాన్ని పేదలకు పంచుతున్నాడు.
పేదవారి కలలను నిజం చేస్తూ, వారి దృష్టిలో హీరోగా మారాడు. ఈ మంచి తనమే అందరిలోనూ స్పెషల్ గా నిలించింది.
హర్ష సాయి చేసే ఇలాంటి పనులువల్లనే ప్రత్యేకంగా ఆయనకి ప్యాన్ బేస్ తయారయ్యింది. ఇంకా హర్ష సాయి పేరుతో ఫ్యాన్స్ పాదయాత్రలు కూడా చేస్తున్నారు.
ఈ యంగ్ స్టార్ కి తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానళ్లకు కొన్ని మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు.
హర్షసాయికి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ తో పాటు ఇంకా ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో దాదాపు కోటిమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ టాలెంటెడ్ కుర్రాడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుండు అనే రూమర్ గతంలో ఉంది.
కానీ తాజాగా హర్షసాయి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. సిక్స్ ప్యాక్‌తో .. టోన్డ్ బాడీతో హర్షసాయి హీరోగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు.
అయితే పాన్ ఇండియా లెవెల్ లో యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్షసాయి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.