సాదారణంగా మనమంతా ఎప్పుడో అప్పుడు ట్రైన్ జర్నీ చేస్తూంటాం. కానీ, ఒక్కసారైనా ట్రైన్ టికెట్ పై ఏమేమి ఉన్నాయో గమనించం. మీరు గమనించారో… లేదో… ట్రైన్ టికెట్ పై 5 అంకెల సంఖ్య ఒకటి ఉంటుంది. దాని అర్ధం ఏమిటో… అలాగే అది దేనికి సంకేతమో మీకు తెలుసా!
ట్రైన్ టికెట్ పై ఉండే 5 డిజిట్స్ నెంబర్ లో చాలా పెద్ద ఇన్ఫర్మేషనే దాగి ఉంది. ఈ నెంబర్ మీరు ఎక్కడినుండీ ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలని తెలుపుతుంది. అలాగే, ట్రైన్ స్టేటస్, కేటగిరీ వంటివి కూడా తెలియజేస్తుంది. కేవలం 5 డిజిట్స్ ఫిగర్ లోనే ఇంత ఇన్ఫర్మేషన్ దాగి ఉందంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది కదూ!
5 అంకెల సంఖ్యకి అర్థం ఏమిటి?
నిజానికి ప్రతి ఒక్క ట్రైన్ కీ 5 అంకెలు గల ఓ ప్రత్యేక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ సహాయంతో దానిని గుర్తించటం జరుగుతుంది. ఆ నెంబర్ లో 0 నుంచి 9 వరకు ఏ అంకె అయినా ఉండవచ్చు. అయితే, వీటిలో 0 అంకె ఉంటే ఒక అర్ధం; 1 నుంచి 4 వరకూ అంకెలు ఉంటే ఇంకో అర్ధం; 5 నుంచి 9 వరకు అంకెలు ఉంటే మరో అర్ధం కలిగి ఉంటాయి.
మొదటి అంకె 0 ఉంటే –
మొదటి అంకె 0 ఉంటే… ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్ అని అర్ధం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ స్పెషల్, హాలిడే స్పెషల్, లేదా ఇతర స్పెషల్ కేటగిరీ ట్రైన్స్ అని అర్ధం.
మొదటి అంకె 1 నుంచి 4 వరకు ఉంటే –
- మొదటి అంకె 1 ఉంటే… ఈ ట్రైన్ ఎక్కువ దూరం వెళుతుందని అర్థం. ఉదాహరణకి రాజధాని, శతాబ్ది, గరీబ్ రథ్, జన్ సాధర్, సంపర్క్ క్రాంతి, దురంతో వంటివి.
- మొదటి అంకె 2 ఉంటే… ఈ ట్రైన్ చాలా దూరం వెళుతుందని అర్ధం. (1-2) అంకెలకి చెందిన రైళ్లు రెండూ కూడా ఒకే కేటగిరికి చెందుతాయి.
- మొదటి అంకె 3 ఉంటే… ఈ ట్రైన్ కోల్‌కతా సబ్ అర్బన్ ట్రైన్ అని అర్థం.
- మొదటి అంకె 4 ఉంటే… ఈ ట్రైన్ మెట్రో సిటీస్ కి చెందింది అని అర్ధం. ఉదాహరణకి ఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్, ఇతర మెట్రో నగరాలు.
మొదటి అంకె 5 నుంచి 9 వరకు ఉంటే –
- మొదటి అంకె 5 ఉంటే… ప్యాసింజర్ ట్రైన్ అని అర్ధం.
- మొదటి అంకె 6 ఉంటే… MEMU ట్రైన్ అని అర్ధం.
- మొదటి అంకె 7 ఉంటే… DEMU ట్రైన్ అని అర్ధం.
- మొదటి అంకె 8 ఉంటే… రిజర్వ్డ్ ట్రైన్ అని అర్ధం.
- మొదటి అంకె 9 ఉంటే… ముంబై సబ్ అర్బన్ ట్రైన్ అని అర్ధం.
రెండవ అంకె, మరియు తదుపరి అంకెలు –
మొదటి అంకె 0 లేదా, 1 లేదా, 2తో ప్రారంభమైతే, మిగిలిన నాలుగు అక్షరాలు రైల్వే జోన్, మరియు డివిజన్ ని సూచిస్తాయి. రెండవ అంకె 5 లేదా, 6 లేదా, 7లతో ప్రారంభమైతే జోన్‌ని తెలియచేస్తుంది. మిగిలిన అంకె వారి డివిజన్ కోడ్‌ని తెలియజేస్తుంది.
దీనినిబట్టి చూస్తే ట్రైన్ టికెట్ పై ఉండే 5 అంకెల నెంబర్ మన జర్నీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. అంటే ఈ నంబర్ మనకి బాగా ఉపయోగపడుతుంది.