నిద్రిస్తున్న సమయంలో కలలు రావటం అనేది చాలా సాదారణ విషయమే! రాత్రిపూట వచ్చే కలలకి, తెల్లవారుజామున వచ్చే కలలకి చాలా వ్యత్యాసం ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. ఎలాగంటే, తెల్లవారుజామున వచ్చే కలలు దాదాపుగా నిజమవుతాయని నమ్ముతారు. అయితే, ఈ కలల్లో కొందరికి దేవుళ్ళ కలలు వస్తే, ఇంకొందరికి దెయ్యాల కలలు మరికొందరికి నదులు, సముద్రాలు, అడవులు, జంతువులు, పక్షులకి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఏదేమైనా కానీ, మొత్తం మీద ఆ కలల ప్రభావం మన జీవితంపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అయితే, కలలో కాకి కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
- ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు వారి కలలో కాకి కనిపించి… అది తూర్పు నుండి పడమరకు ఎగురుతున్నట్లుగా కనిపిస్తే… అతను త్వరలోనే సంపదను పొందుతాడని అర్ధం.
- అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కలలో కాకి పెరుగు తింటున్నట్లుగా కనిపిస్తే… అతని ఆరోగ్యం త్వరలోనే కుదుటపడుతుంది అని నమ్మకం.
- ఏదైనా పోటీ పరీక్షకి సిద్ధమవుతున్న విద్యార్థికి కలలో కాకి కనిపించి… పెరుగు, వెన్న తింటున్నట్లుగా ఉంటే… ఆ పరీక్షలో విజయం సాధిస్తారు.
- పెళ్లికాని యువతీ యువకుల కలలో కాకి వారి ఇంటి వెనుక కూర్చొని ఉన్నట్లుగా కనిపించినట్లయితే… త్వరలోనే వారికి పెళ్లి జరుగుతుంది.
- వివాహం అయిన వ్యక్తుల కలలో కాకి కనిపించి… పాలు తాగుతున్నట్లయితే.. వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. అదే, వివాహం కాని వ్యక్తులకి అలా కనిపిస్తే… త్వరలోనే వివాహం నిశ్చయమవుతుంది.
- వలలో చిక్కుకున్న కాకి… ఎలాగోలా ఆ ఉచ్చు నుండి బయటపడి ఎగిరిపోయినట్లు కనిపిస్తే… శత్రువులపై విజయం సాధిస్తారని అర్థం.
- నిరుద్యోగి కలలో కాకి పెరుగు తింటూ కనిపిస్తే… త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది.
- వ్యాపార స్థలంలో కాకి కూర్చున్నట్లుగా కనిపిస్తే… వారు వ్యాపారంలో విజయం సాధిస్తారు.
- ఎగురుతున్న కాకుల గుంపులోంచి ఓ కాకి తిరిగి వచ్చి మనం పెట్టిన పండుని తిన్నట్లుగా కనిపిస్తే… వారికి సంపద లభించడం కానీ, సంతాన భాగ్యం కలగడం కానీ జరుగుతుంది.