ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్… గత కొద్ది రోజుల క్రితమే పేమెంట్ సర్వీసెస్ ప్రారంభించింది. ఈక్రమంలో ఎక్కువ మంది వినియోగదారులను తమ వైపు ఆకర్షించేందుకుగాను క్యాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకువచ్చింది.
వాట్సాప్ ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకునే వారికి… ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తోంది. అయితే, కేవలం ఒక రూపాయి పంపించినా కూడా ఈ క్యాష్ బ్యాక్ లభించడమే విశేషం. వాట్సాప్ యాప్ యూజ్ చేసి 1 రూపాయి ట్రాన్స్ఫర్ చేస్తే… వారి ఎకౌంట్ కి 51 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఈ క్యాష్ బ్యాక్ మన ఎకౌంట్ లో క్రెడిట్ అవుతుంది.
అయితే.. ఈ ఆఫర్ ప్రతిసారీ కాదు, కేవలం 5 ట్రాన్సాక్షన్ల వరకు మాత్రమే! ప్రస్తుతానికి ఈ ఆఫర్ ఆండ్రాయిడ్, మరియు iOS యూజర్లకి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
గతంలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి పేమెంట్ యాప్స్ కూడా మొబైల్ పేమెంట్స్ ప్రారంభించిన సమయంలో ఇలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్ నే అందించాయి. దీంతో అవి యూజర్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం వాట్సాప్ కూడా అదే దారిలో వెళ్తోంది. సో, ఫ్యూచర్ లో వాట్సాప్ కూడా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.