ప్రతి మనిషి తన జీవితం ఎంతో ఆనందంగానూ, సంతోషంగానూ సాగి పోవాలి అని కోరుకుంటూ ఉంటాడు. మరి వీటిని సాధించుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి ధనం అనేది చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరు వారి వారి వృత్తితో పాటు వారు ఉండే ఇంటి ఆవరణను, మరియు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
అందుకే ఈ మద్యకాలంలో చాలామంది ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్‌ను పెంచుతున్నారు. మనీ ప్లాంట్ చాలా అందంగా ఉంటుంది. అలాగే తీగ జాతికి చెందినది. సూర్యరశ్మి లేకపోయినా సరే ఇది చాలా విరివిగా పెరుగుతూ, మన ఇంటి పరిసరాలను మరియు మనలను సంతోష పరుస్తూ, మనకు చక్కటి పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకుని వస్తాయి. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది దీనిపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం కూడా మనీ ప్లాంట్ అనేది డబ్బుకు ప్రతీక. కాబట్టి ఏ ఇంట్లో అయితే మనీ ప్లాంట్ ఉంటుందో… అక్కడ డబ్బు ఉన్నట్లే! అని ప్రతి ఒక్కరు భావిస్తూ దీని పైన మనసు పారేసుకుంటున్నారు. మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడం వల్ల వాస్తు దోషాలు తొలగి, వారి ఆర్ధిక సమస్యలు కూడా తొలగి ధన వర్షం కురుస్తుందని ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు. అందుకే వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఏ దిశలో పెంచితే శుభ ఫలితాలు వస్తాయో… ఏ దిశలో పెంచితే అశుభ ఫలితాలు వస్తాయో… ఇప్పుడు తెలుసుకుందాము.
ఇంట్లో శుభ ఫలితాలు కలిగి ధనలాభం పొందాలి అంటే… మనీ ప్లాంట్‌ను తూర్పు ఆగ్నేయ దిశలో పెంచటం చాలా మంచిది. ఆగ్నేయ దిశలో పెంచితే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆగ్నేయ దిశకు వినాయకుడు అధిపతి కాబట్టి ఈ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచితే శుభ ఫలితాలు పొంద వచ్చు. అలాగే పొరపాటుగా కూడా మనీ ప్లాంటును తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం దిశల్లో అస్సలు పెంచకూడదు. అలా పెంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి.
మనిషి ఆర్ధికంగా పైకి ఎదుగుతూ అభివృద్ధి చెందాలే కానీ, క్రిందకు దిగజారి పోకూడదు. అలాగే మనీ ప్లాంటును ఎల్లప్పుడూ మన ఇంటి లోపలే పెంచుకోవాలి. ఎందుకంటే ఈ మొక్కకు తీగ లాగా పైపైకి పెరగడం దీని లక్షణం. అదే ప్రయోజనకరం. దాని తీగ క్రిందికు దిగజారి పోయి వ్రేలాడ పోయినట్లయితే ఆర్థికంగా నష్టాలు ఏర్పడవచ్చు. మనీ ప్లాంట్‌ను నీటి డబ్బా లేదా పెద్ద కుండలో పెట్టి పెంచినా సరిపోతుంది. ఎందుకంటే దీనికి తీగ లాగా ప్రాకే స్వభావం ఉండి దాని ఎనర్జీ పూర్తిగా ఇంటి మొత్తానికి వ్యాపిస్తుంది.