స్మార్ట్‌ఫోన్, లేదా ఫీచర్ ఫోన్ ఇలా ఫోన్ ఏదైనా సరే… అందులో సిమ్ కార్డ్ మాత్రం తప్పనిసరి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గరా ఫోన్ తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అలాంటప్పుడు ఆ ఫోన్ కి సంబంధించి కొన్ని ముఖుమైన వివరాలు తెలుసుకుంటే మంచిది.
సిమ్ కార్డు లేని ఏ ఫోన్ అయినా సరే కేవలం ఒక పెట్టె మాత్రమే! అలాంటప్పుడు ఆ ఫోన్ లో ఇన్సర్ట్ చేసిన చిన్న చిప్ మొత్తం ప్రపంచాన్నే మన కళ్ళముందు ఉంచుతుంది. అయితే, ఇక్కడ మీరో విషయం గమనించినట్లైతే, ఆ సిమ్ కార్డ్ ఒకవైపు కట్ చేయబడి ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా!
నిజానికి మొదట్లో ఈ సిమ్‌కార్డ్స్ కార్నర్స్ అన్నీ సమానంగానే ఉండేవి. కానీ, యూజర్స్ సిమ్‌ను ఇన్‌స్టాల్ చేసే సమయంలో చాలా ఇబ్బంది పడేవారు. ప్రతిసారి సిమ్‌ను రివర్స్‌లో ఇన్సర్ట్ చేసేవారు. అలా చేసినప్పుడు మళ్ళీ సిమ్ ను బయటకు తీసి వేసుకోవాల్సి వచ్చేది. ఇలా పదే పదే చేయటం వల్ల దాని చిప్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
దీంతో యూజర్ ఇబ్బందులను పరిశీలించిన టెలికాం కంపెనీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఒకేసారి సరిగ్గా ఇన్‌స్టాల్ అయ్యేలా ప్రతి సిమ్ కార్డ్‌ను మూలన కత్తిరించడం మొదలు పెట్టాయి. అందువల్ల ప్రతి సిమ్‌కి కట్ ఆఫ్ కార్నర్ ఉంటుంది.
కాలానుగుణంగా రాను రానూ సిమ్ కార్డుల సైజ్ కూడా నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. గతంలో సిమ్ సైజ్ పెద్దగా ఉండేది. ఇప్పుడు నానో సిమ్ పేరుతో చిన్నగా అయిపొయింది. ఇకముందు కూడా చిన్నదిగానే ఉండబోతుంది. ఎందుకంటే, ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తుంది. ఇక ఎవరైనా ఫీచర్ ఫోన్ ఉపయోగించినా అందులో కూడా చిన్న సైజు సిమ్ స్లాట్ నే ఏర్పాటుచేస్తున్నారు.
SIM full form – సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (SIM). ఈ కార్డ్ ఇంటర్నేషనల్ మొబైల్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ (IMSI) నంబర్, మరియు ఆపరేటింగ్ సిస్టమ్ (COS)ని సెక్యూర్ మ్యానర్ లో స్టోర్ చేసి ఉంచే ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్.