ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోవటంతో… ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. పచ్చని సంసారాలను రోడ్డున పడుతున్నాయి. అయినా జనాల ఆలోచనా ధోరణిలో మార్పు రావట్లేదు. రీసెంట్ గా ఇలాంటి సంఘటనే మద్యప్రదేశ్‌లో ఒకటి జరిగింది.
భోపాల్ లోని నూర్‌మహల్ రోడ్‌లో నివసించే ఒక ముస్లిం యువతికి తన భర్త వేరొక యువతితో తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై గతంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తని విచారించగా..,. తాను ఎవ్వరితో తిరగడం లేదని బుకాయించాడు. దీంతో ఫలితం లేకుండా పోయింది. ఇక లాభం లేదనుకొని తానే భర్తపై నిఘా పెట్టింది.
ఓ రోజు జిమ్‌లో తన భర్త ప్రియురాలితో కలిసి ఉన్నాడని తెలుసుకొంది. వెంటనే అక్కడికి వెళ్లి… వాళ్ళిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పట్టుకోవడమే కాదు, అతని ప్రియురాలిని జుట్టు పట్టుకొని… చెప్పుతో ఎడాపెడా వాయించేసింది. తనని అడ్డుకోబోయినందుకు భర్తని కూడా జుట్టు పట్టుకొని కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.