నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిపై దాడి (వీడియో)

కర్ణాటక రాష్ట్రంలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళా న్యాయవాదిపై దాడికి దిగాడు ఓ వ్యక్తి.  మహిళ అనే కనికరం ఏమాత్రం లేకుండా ఆమెని తన భర్త కళ్ళెదుటే విచక్షణా రహితంగా కొట్టసాగాడు. ఓ కసాయిలా ఏ మాత్రం కనికరం లేకుండా పదే పదే ఆమెని కాలితో తన్నాడు. 

కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌ కి చెందిన మహంతేశ్ చొల్చగుడ్డ అనే వ్యక్తి, అదే పట్టణానికి చెందిన మహిళా న్యాయవాది అయిన సంగీత సిక్కేరి మద్య ఓ ఆస్తికి సంబంధించిన విషయమై కోర్టులో కేసు నడుస్తుంది. ఈ విషయమై వీరిద్దరి మద్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనాన్ని కోల్పోయిన మహంతేశ్… ఉన్నట్టుండి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

కాలితో లాయర్ సంగీత పొట్టపై పదే పదే తన్నాడు. అడ్డుకోబోయిన ఆమె భర్తపై కూడా దాడి చేశాడు. తమని  కాపాడంటూ వేడుకొన్నా… ఎవ్వరూ ముందుకి రాలేదు సరికదా ఈ దృశ్యాన్ని తమ సెల్ ఫోన్లలో వీడియో తీస్తూ ఉండిపోయారు. అలా తీసిన వీడియోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. దాంతో ఈ విషయం అందరికీ తెలిసింది.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top