రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే… దానికి కారణం ఎవరో! ఏమిటో! తెలుసుకోకుండానే చుట్టుపక్కల ఉన్నవారిని నిందించేస్తుంటాం. తమ తప్పు తెలుసుకోనేవాళ్ళు కొందరైతే, తమ తప్పు ఉండీ కూడా ఎదుటివారిని ఇరికించేసేవారు ఇంకొందరు. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
తాజాగా ఓ జంట స్కూటీపై వెళ్తుండగా… స్కూటీ స్కిడ్ అయి కింద పడిపోతారు. అయితే, వెనుక కూర్చున్న మహిళ తమ వెనుక వస్తున్న బైకర్ ఢీకొట్టడం వల్లే తాము పడిపోయామంటూ అతనిపై విరుచుకు పడింది. అయితే, ఈ ఘటనంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
తర్వాత అక్కడికి చేరుకొన్న పోలీసులు విషయం తెలుసుకొని, తప్పెవరిదో పరిశీలిద్దామనుకొని సీసీ ఫుటేజ్ చూడగా అసలు విషయం బయటపడింది. దీంతో అధికారులు ఆమెని మందలించారు. లేకుంటే, ఆ వెనుకున్న బైకర్ పరిస్థితి ఎలా ఉండేదో మీరే ఆలోచించండి.