ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్ సముద్రం అడుగున ఉండిపోయింది. ఇది దాదాపు 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు కదులుతోంది.
1986లో ఈ ఐస్‌బర్గ్ అంటార్కిటికా తీర ప్రాంతం నుంచి విడిపోయి… వేగంగా వెడ్డెల్ సముద్రం అడుగుకు చేరుకుని… అక్కడే ఉండిపోయింది. క్రమేపి అది సముద్రంలో ఒక మంచుద్వీపంలా మారింది. దీనిని ఏ23ఏగా వ్యవహరిస్తారు.
ఈ ఐస్‌బర్గ్ దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మరియు 400 మీటర్లు మందం కలిగి ఉంటుంది. యూరప్‌లోని అతిపెద్ద ఆకాశహర్మ్యం అయిన ‘లండన్ షార్డ్’ ఎత్తు 310 మీటర్లు కాగా, దాని కంటే కూడా ఇది దాదాపు 100 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. అంటే గ్రేటర్ లండన్‌కు రెండు రెట్ల కంటే పెద్దదిగా ఉంటుంది.
మంచుతో కూరుకుపోయిన అంటార్కిటికా ఖండంలోని ఫిల్చ్‌నర్ ఐస్ షెల్ఫ్ నుంచి విడివడిన ఐస్‌బర్గ్‌లలో ఏ23ఏ ఒకటి. అయితే, ఇది గత ఏడాది వేగంగా కదులుతూ వచ్చింది. ఇప్పుడు అంటార్కిటికా జలాలను కూడా దాటి రానుంది.
అప్పట్లో దీనిపై సోవియట్ రీసర్చ్ స్టేషన్ ఉండేది. భవిష్యత్తులో ఇది కదిలిపోతుందనే భయంతో రష్యా డ్రుజ్నయా 1 బేస్ నుంచి పరికరాలను హుటాహుటిన తరలించింది.
కానీ, కదలకుండా బల్లపరుపులా ఉండే ఈ ఐస్‌బర్గ్, సముద్రగర్భంలోని బురదనేలలో చిక్కుకుపోవడం వల్ల అంటార్కిటికా తీరం నుంచి ఎక్కువ దూరం వెళ్లలేదు. అలాంటిది ఇప్పుడు సడెన్ గా 37 ఏళ్ల తర్వాత ఎందుకు కదులుతోంది? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
ఏ23ఏ ఐస్‌బర్గ్ మూవ్ అవటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది నీటి ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల అయి ఉండొచ్చు. రెండవది సముద్రపు నీటిలో చిక్కుకుపోవటం వల్ల క్రమంగా పరిమాణం తగ్గుతూ, పట్టు కోల్పోయి కదలడం జరిగి ఉండవచ్చు. మూడవది ఇటీవలి కాలంలో కొన్నినెలలుగా ఇక్కడ వీస్తున్న గాలులు, ప్రవాహాల వల్ల ఇది కదులుతూ ఉండవచ్చు.
రీజన్ ఏదైనా కానీ, ప్రస్తుతం ఇది అంటార్కిటికా ద్వీపకల్పం ఉత్తర కొన నుంచి దూరంగా ప్రయాణించి వెళ్తోంది. అలా ప్రయాణిస్తూ దక్షిణ అట్లాంటిక్ వైపున ఉన్న ”ఐస్‌బర్గ్ అలీ”గా పిలిచే మంచుకొండల శ్రేణి వద్దకు చేరనుంది.
మొత్తం మీద ఏ23ఏ ఐస్‌బర్గ్ ఇలా కదులుతూ వెళ్లి చివరకు కరిగిపోయి, నీటిలో కలిసిపోతే మానవాళికి తీరని నష్టం వాటిల్లనుందని ఓషెనోగ్రాఫర్స్ చెప్తున్నారు.
అంటార్కిటికాలోని రాతి ఫలకాల మీద ఇలాంటి భారీ ఐస్‌బర్గ్‌లపై మంచు తొలగిపోయినప్పుడు అవి కరిగిపోయి ఆ మంచులో ఉన్న ఖనిజ ధూళి బయటికి విడుదల అవుతుంది.
దీనివల్ల సౌత్ జార్జియా ద్వీపంలో సంతానోత్పత్తి చేసే లక్షల కొద్దీ సీల్స్, పెంగ్విన్స్, ఇతర సముద్ర పక్షులకు ముప్పు తలెత్తే అవకాశం లేకపోలేదు.
చివరిమాట:
మొత్తం మీద ఐస్‌బర్గ్ కరిగిపోవటం అంటే… పర్యావరణానికి తీరని ముప్పు వాటిల్లినట్లే! దీనివల్ల ఈ భూమండలం ఎన్నో భయంకర తుఫానులు, వరదలు వంటి ఉపద్రవాల్ని ఎదుర్కొనవలసి వస్తుంది.