ప్రాణవాయువునిచ్చే చెట్లు మన ఆయువుని తీస్తాయంటే మీరు నమ్ముతారా..! కానీ, ఇది నిజం. కరీబియన్ దీవులకు చెందిన మంచినీల్ అనే చెట్టు చాలా ఈజీగా మన ప్రాణాలు తీసేస్తుంది. జస్ట్ దాని దగ్గర నిలబడితే చాలు. అవలీలగా మన ప్రానాలని అనంత వాయువుల్లో కలిపేస్తుంది.
నిజానికి చెట్లనేవి కావలసినంత ప్రాణ వాయువుని అందిస్తుంటాయి. కానీ, మంచినీల్ చెట్టు మాత్రం విషపు వాయువుని వెదజల్లుతుంటుంది. ఈ చెట్టు చూడటానికి అచ్చం యాపిల్ చెట్టుని పోలి ఉంటుంది. ఈ చెట్టు ఆకులు కూడా యాపిల్ చెట్టు ఆకులని పోలి ఉంటాయి. ఇక ఈ చెట్టుకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. అవికూడా అచ్చం యాపిల్ పండ్లని పోలి ఉంటాయి. అందుకే ఈ చెట్టుని ‘బీచ్ యాపిల్’ అని కూడా పిలుస్తారు.
ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చెట్లలో ఇదీ ఒకటి. ఇదో పూల జాతికి చెందిన చెట్టు. ఈ చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారుతుంటుంది. ఆ ద్రవం చెట్టు బెరడు, ఆకులు, పండ్లు ఇలా అక్కడా… ఇక్కడా… అని లేకుండా చెట్టుకి ఎక్కడనుంచైనా వస్తాయి. అ పాలు చాలా విషపూరితమైనవి. ఆ పాలను టచ్ చేస్తే… ఒంటిపై దద్దుర్లు, కురుపులు, బొబ్బలు వంటివి వస్తాయి.
ఇక ఎవరైనా ఈ చెట్టు కిందకెళ్లి నిలబడితే చాలు… మెల్లగా ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా వర్షం పడేటప్పుడు ఈ చెట్టు క్రిందకి వెళ్లి నిలబడితే ఇక ఇంతే సంగతులు. రెయిన్ డ్రాప్స్ జారి పడి… ఈ ట్రీ మిల్క్ తో కలిసి పాయిజన్ గా మారతాయి. అవి మన స్కిన్ పై పడ్డప్పుడు ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. చర్మం మొత్తం కాలిపోయినట్లుగా అయిపోతుంది. ఆ తర్వాత స్కిన్ బెలూన్ లా ఉబ్బి… పగిలి… రక్తం కారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, నరకం కనిపిస్తుంది.
ఇక ఈ చెట్టు పాలు పొరపాటున కళ్లలో పడితే… కంటి చూపు కోల్పోయే చాన్స్ ఉంది. ఈ చెట్ల పండ్లు తింటే… నోరంతా మండి పోతున్నట్లు అనిపిస్తుంది. కొంతసేపటికి గొంతు పట్టేస్తుంది. ఆపై ప్రాణాలకి కూడా ముప్పు వాటిల్లుతుంది. ఈ చెట్లు ఎప్పుడైనా కాలిపోతే వచ్చే పొగ నుంచి కంటి సమస్యలు వస్తాయి.
ప్రస్తుతం ఈ చెట్లు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఫ్లోరిడా, మెక్సికో, ది బహమాస్ లలో కనిపిస్తుంటాయి. 49 అడుగుల ఎత్తు వరకూ పెరగగలిగే ఈ చెట్లు ఆకుపచ్చ-పసుపుపచ్చ పూలతో కనువిందు చేస్తాయి. ఇక వీటి బెరడు ఎరుపు-బూడిదరంగుతో ఉంటుంది.