ఒక సాదారణ బాత్ సోప్ కాస్ట్ వంద కాదు, వెయ్యి కాదు, ఏకంగా లక్షల్లోనే అంటే మీరు నమ్ముతారా..! ప్రపంచంలో అసలు ఇంత కాస్ట్లీ సోప్స్ కూడా ఉన్నాయా! అంటే ఉన్నాయనే చెప్పాలి.
లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన బాడర్ హాసన్ అండ్ సన్స్ ఫ్యామిలీ ఈ సబ్బులని తయారు చేస్తుంది. “ది ఖాన్ అల్ సాబిన్” అనే పేరుతో వీటిని విక్రయిస్తుంది. అయితే, 15వ శతాబ్ధం నుంచే ఈ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సోప్స్ ని వాడుకలోకి తెచ్చినట్లు సమాచారం.
నిజానికి వీరు ఈ సబ్బుల తయారీకి ఎలాంటి మిషినరీ వాడరు. కేవలం చేతులతోనే వీటిని తయారు చేస్తారు. తయారీలో ఉపయోగించే రకరకాల నూనెలవల్ల ఇవి సహజ సువాసనలతో ఉంటాయి. అందుకే, చర్మ సంరక్షణ కోసం ఈ లగ్జరీ సోప్స్ ని ఉపయోగిస్తారు. వీటిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని కొన్ని ప్రత్యేకమైన షాప్స్ లో మాత్రమే అమ్ముతారు.
ముఖ్యంగా ఈ సబ్బులు ఇంత ఖరీదుతో ఉండటానికి కారణం వీటి తయారీలో గోల్డ్, అండ్ డైమండ్ పౌడర్‌తో పాటు, ఆర్గానిక్ హనీ, ప్యూర్ ఆలీవ్ ఆయిల్, డేట్స్ వంటి వాటిని ఉపయోగిస్తారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బుగా చెలామణి అవుతుంది. మొదట్లో ఇది చూడటానికి ఒక జున్ను ముక్కలా ఉండేది. కానీ ఇప్పడది స్పెషల్ గా డిజైన్ చేయబడింది.
ఈ సబ్బు ఖరీదు అక్షరాలా 2,800 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో 2 లక్షలకు పైగా ఉంటుంది. ఈ సబ్బులు విఐపీలు, గెస్టులు, సెలెబ్రిటీలు వంటి వారికి మాత్రమే అందించబడతాయి. ఈ ఖరీదైన సబ్బులను 2013లో ఖతర్ అధ్యక్షుడి భార్యకు గిఫ్ట్‌గా ఇవ్వటం జరిగింది. అలాగే, ఈ సబ్బులు ఉపయోగించటం వల్ల అధ్యాత్మక శక్తి, మానసిక ప్రశాంతత కూడా లభిస్తాయట.